సిడ్నీ వేదికగా ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఐదో టెస్ట్ జరుగుతోంది. అయితే ఇందులో కూడా టీమిండియా బ్యాట్స్‌మెన్ల ఫ్లాప్ షో కొనసాగుతోంది. అయితే సిడ్నీ టెస్ట్‌కు ఓ స్పెషాలిటీ ఉంది. మీరు మ్యాచ్‌ను అబ్జర్వ్ చేస్తే ఆస్ట్రేలియా టీమ్‌తో పాటు.. గ్రౌండ్ మొత్తం పింక్ కలర్‌లోకి మారింది. ఆసీస్ ప్లేయర్ల జెర్సీలు, క్యాప్స్‌తో పాటు.. హోర్డింగ్స్, యాడ్స్ ఇలా గ్రౌండ్ మొత్తం గులాబీ కలర్‌లోకి మారిపోయింది.
అయితే పింక్ టెస్ట్‌కు ఓ హిస్టరీ ఉంది. ఓ ప్లేయర్‌కు ఆసీస్ టీమ్ ఎంత ప్రాముఖ్యత ఉందో చాటి చెబుతుంది.. అలాగే సామాజిక సేవలో మేముసైతం అంటూ ఆసీస్ ప్లేయర్స్ ఎలా భాగమవుతున్నారో తెలుపుతుంది. లెజెండ్ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్ అందరికి సుపరిచితమే. అయన భార్య జేన్ మెక్‌గ్రాత్ 2008లో బ్రెస్ట్ క్యాన్సర్‌తో మరణించారు. తన భార్య మృతితో బ్రెస్ట్ క్యాన్సర్‌పై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించాలని డిసైడ్ అయ్యాడు మెక్‌గ్రాత్. అప్పటి నుంచి మెక్‌గ్రాత్ ఫౌండేషన్ ద్వారా సేవలు ప్రారంభించారు.
2009 నుంచి బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు కొత్త ఏడాదిలో ఆడే మొదటి టెస్ట్‌ను పింక్ టెస్ట్‌గా ఆడుతుంటుంది ఆసీస్ టీమ్. ఈ మ్యాచ్ ద్వారా వచ్చే ఆదాయం మెక్‌గ్రాత్ ఫౌండేషన్‌కు వెళ్తుంది. ఈ ఫౌండేషన్ బ్రెస్ట్ క్యాన్సర్ రోగులకు సహాయం చేస్తుంది. అంతేకాదు టెస్ట్ మ్యాచ్‌లో మూడో రోజును జేన్ మెక్‌గ్రాత్ డేగా పిలుస్తారు. ఓ ప్లేయర్ కోసం.. సామాజిక స్పృహతో క్రికెట్ ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయం అభినందించతగ్గదే అని చెప్పాలి