26.2 C
Hyderabad
Sunday, April 19, 2026

Live Video

spot_img

అమెరికాలో ఉగ్రదాడి, 10 మంది మృతి

అమెరికాలో కొత్త ఏడాది సందర్భంగా ఉగ్రదాడి జరిగింది. అమెరికాలోని లుసియానా స్టేట్‌లోని న్యూ ఓర్లియాన్స్‌లో బుధవారం తెల్లవారుజామున 3.15 గంటలకు ఉగ్రదాడి జరిగింది. జర్మనీలో క్రిస్‌మస్‌ మార్కెట్‌పై జరిగినట్టుగానే బౌర్బోన్‌ స్ట్రీట్‌లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ జరుగుతుండగా వారిపై నుంచి ట్రక్‌ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇప్పటికే పది మంది మృతి చెందగా.. గాయపడ్డ 35 మందిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డవారిలో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు.

నిందితుడు కావాలనే బారికేడ్లను ఢీకొట్టి ప్రజలపైకి దూసుకొచ్చినట్టు అర్థమవుతుందని పోలీసులు తెలిపారు. స్థానిక అధికారులు దీనిని ఉగ్రదాడిగా అభివర్ణిస్తున్నారు. అందరిని ఢీకొట్టిన తర్వాత ట్రక్‌ దిగి కాల్పులు జరిపాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. నిందితుడిని ఇంకా పోలీసులు అదుపులోకి తీసుకోలేదు. అతడిని పట్టుకునేందుకు జల్లెడ పడుతున్నారు. ఉగ్రదాడిపై అధ్యక్షుడు జో బైడెన్‌కు అధికారులు సమాచారం అందించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com