మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచువిష్ణు సిబ్బంది మరో వివాదంలో చిక్కుకున్నారు. జల్పల్లిలోని వాళ్ల ఫామ్‌హౌజ్ సమీపంలో అడవిలో వేట సాగించారు. మంచువిష్ణు ప్రధాన అనుచరులు అడవిలో వేటాడి అడవిపందులను పట్టుకున్నారు. వాటిని బంధించి తీసుకెళ్లారు. మంచువిష్ణు మేనేజర్ కిరణ్, ఎలక్ట్రిషియన్ దేవేంద్ర ప్రసాద్ ఓ అడవి పందిని బంధించి కర్రలకు కట్టి తీసుకెళ్తున్న వీడియోలు బయటకు వచ్చాయి. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఇద్దరినీ మంచుమనోజ్ పలుసార్లు హెచ్చరించారని, అడవి పందులను వేటాడొద్దన్నారని అయినా వాళ్లు వినిపించుకోవడం లేదని అంటున్నారు. అదవి పందులను వేటాడిన వారిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.