హైదరాబాద్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ ప్లాస్టిక్ గోదాంలో తెల్లవారు జామున మంటలు ఎగిసిపడ్డాయి. ప్లాస్టిక్ పరిశ్రమ కావడం పూర్తిగా మంటల్లో చిక్కుకోవడంతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది. రాచకొండ కమిషనరేట్ బాలాపూర్ పోలీస్స్టేసన్ పరిధిలోని బిస్మిల్లాకాలనీలో జరిగిందీ సంఘటన. స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలానికి బాలాపూర్ పోలీసులు వచ్చారు. ఫైర్ ఇంజన్లను రప్పించి మంటలు ఆర్పేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ, చాలా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో మంటలు అదుపుచేయడం కష్టమయ్యింది. అగ్నిప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.