మైనర్ ఘటనలు మినహా 2024 శాంతిభద్రతలు కాపాడామని, రాష్ట్రంలో మతపరమైన కలహాలు, సమస్యలు లేవని తెలంగాణ డిజిపి జితేందర్ వెల్లడించారు. పారదర్శకంగా శాంతి భద్రతలు కాపాడమన్నారు.
హైదరాబాద్ లో ఆదివారం రాష్ట్ర పోలీసు వార్షీక నివేదికను డిజిపి జితేందర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమాయక ప్రజలను నక్సల్స్ హతమార్చారని, దాంతో పోలీస్ కూంబింగ్ చేయాల్సి వచ్చిందన్నారు.
పూర్తిడ్రగ్స్ నిర్మూలన దిశగా తగిన చర్యలు తీసుకుంటాన్నామని, ఈ ఏడాది గంజాయి 1950 కేసులు నమోదు అయ్యాయి. కేసులు పెరిగాయన్నారు. 20 టన్నుల గాంజాయి సీజ్ చేసామని, స్పెషల్ నార్కోటిక్ బ్యూరో డ్రగ్స్ నిర్మూలనకు కృషి చేస్తోందన్నారు. 48 డ్రగ్ కేసుల్లో నిందితులకు శిక్ష పడిందని చెప్పారు.
ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి రవాణా కట్టడి చేశామని చెప్పిన డిజిపి 142 కోట్ల విలువ చేసే గంజాయి సీజ్ చేసామన్నారు. ఇందులో భాగంగా 5.5 కోట్ల ఆస్తులు సీజ్ చేశామని ndps కేసులు నమోదు చేసామని పేర్కొన్నారు.
రాష్ట్రంలో సైబర్ క్రైమ్ రేట్ పెరిగిందని, దేశంలో మొదటిసారిగా సైబర్ నేరగాళ్ల నుండి 2.42 కోట్ల నగదు కాపాడమని డిజిపి పేర్కొన్నారు. 180 కోట్ల నగదు బాధితులకు అందజేశామని, 10 వేల ఐ ఎం ఈ ఏ నెంబర్లు బ్లాక్ చేసినట్టు చెప్పారు. ఈ ఏడాది డయాళ్ 100 కాల్స్ కు 16,92 వేల కాల్స్ రిసివ్ చేసుకున్నామన్న డిజిపి..7నిమిషాల వ్యవధిలో ఘటన స్థలానికి చేరుకోగలిగామన్నారు.
రాష్ట్రంలో 1000 పెట్రోల్ కార్స్ ఉన్నాయని, 2,100 బ్లు కొల్ట్స్ పోలీస్ కానిస్టేబుల్ అఫీసర్స్ విధులు నిర్వహిస్తున్నారని డిజిపి జితేందర్ వివరించారు. ఈ ఏడాది బాధితులు పోగొట్టుకున్న 75 వేల ఫోన్స్ ట్రేస్ చేసినట్టు తెలిపారు. రికార్డు స్థాయిలో నవంబర్ మాసంలో 38వేల ఫోన్స్ బాధితులకు సైతం అందజేసామని, ప్రభుత్వం నిర్ణయం మేరకు ట్రాన్స్ జెండర్ లను విధుల్లోకి తీసుకున్నాని పేర్కొన్నారు.
మహిళలు, చిన్నారుల రక్షణలో భాగంగా పోలీస్ హెల్ప్ లైన్ ద్వారా 29,600 ట్రాక్ చేశామని, రౌడీ షీటర్ లపై కఠిన చర్యలు తీసుకున్నామని చెప్పారు. 18 కేసులు నమోదయ్యాయని, ఇందులో 35 మంది రౌడి షీటర్ లకు శిక్ష పడిందన్నారు. 77 పోక్సో కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 82 కేసులో నిందితులకు శిక్ష పడిందని డిజిపి తెలిపారు. రాష్ట్రంలో 09.87 శాతం క్రైమ్ పెరిగిందని తెలిపారు.