28.2 C
Hyderabad
Wednesday, April 22, 2026

Live Video

spot_img

ఒక్క సెంచరీ.. అనేక రికార్డులు

ఎప్పుడొచ్చామన్నది కాదు.. ఏం చేశామన్నది ముఖ్యం అంటున్నాడు నితీష్‌ రెడ్డి. అవును మన తెలుగు తేజం నితీష్‌ రెడ్డి.. ఇప్పుడీ కుర్రాడీ పేరు చాలా రోజుల వరకు గుర్తుండిపోతుంది. అతను ఆడిన ఆట అలాంటిది. బాక్సింగ్ డే టెస్ట్‌లో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో క్రీజులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ఆల్‌రౌండర్ ఓ చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. టాప్ స్కోరర్‌గా నిలిచాడు.. తన కెరీర్‌లో తొలి సెంచరీ చేశాడు.. టీమిండియాకు ఫాలో ఆన్ గండాన్ని తప్పించాడు.. అత్యంత చిన్న వయసులో సెంచరీ చేసిన రికార్డును తన పేరిట రాసుకున్నాడు.. 8వ స్థానంలో వచ్చి ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ చేసిన తొలి ఇండియన్ క్రికెటర్‌గా నిలిచాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలానే ఉంది నితీష్‌ రెడ్డి ఇన్నింగ్స్‌ కథ.

బ్యాట్‌తో అతను బాదింది బంతిని మాత్రమే కాదు.. కంగారుల కాన్ఫిడెన్స్‌ని.. టీమిండియా ఫాలో ఆన్‌ భయాన్నీ. అతను నిలపెట్టింది భారత్ పరువును మాత్రమే కాదు.. వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్స్ ఆశని కూడా. నిజానికి మోస్ట్ ఎక్స్‌పీరియన్స్‌ ప్లేయర్స్‌ అంతా కూడా మెల్‌బోర్న్‌ పిచ్‌లపై దెబ్బతిన్నారు. రోహిత్, కోహ్లీ, రాహుల్, పంత్‌ గతంలో ఇదే పిచ్‌లపై దుమ్ముదులిపిన వారే. కానీ వారంతా ఈసారి దారుణంగా ఫెయిల్ అయ్యారు. అలాంటి పిచ్‌పై ఆఖర్లో వచ్చిన నితీష్‌ ఆచితూచి ఆడాడు. ఆసీస్‌ బౌలర్లు వేసే ఒక్కో బంతిని డీకోడ్ చేస్తూ బౌండరీలు బాదాడు. ఓపికగా పరుగులు రాబట్టాడు. అలా 171 బంతులను ఎదుర్కోని 10 ఫోర్లు, ఒక సిక్స్‌ బాదీ సెంచరీని పూర్తి చేసుకున్నాడు నితీష్‌. నితీష్ ఆట చూసి టీమిండియా ప్లేయర్లు, అభిమానులే కాదు.. ఆస్ట్రేలియా టీమ్ కూడా కాస్త షాక్ అయ్యింది. ఆ తర్వాత అతని వద్దకు వచ్చి అభినందించడం కనిపించింది.

నితీష్‌ రికార్డులు ఇవే..

  • 8వ స్థానంలో వచ్చి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌ నితీష్‌ రెడ్డి. అంతకుముందు అనిల్ కుంబ్లే(87) పేరుతో ఈ రికార్డు ఉండేది.
  • ఆస్ట్రేలియా గడ్డపై ఒక టెస్ట్ సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌ నితీష్‌ రెడ్డి. ఈ ఇన్నింగ్స్‌లో బాదిన ఒక సిక్సర్‌తో కలిపి మొత్తం 8 సిక్స్‌లు తన ఖాతాలో వేసుకున్నాడు.
  • నితీశ్‌ కంటే ఈ రికార్డు మైకేల్ వాన్‌ (2022-03), క్రిస్‌ గేల్ (2009-10) పేరుపై ఉంది.
  • అతి చిన్న వయసులో ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ చేసిన మూడో వ్యక్తిగా నితీష్‌ రెడ్డి.

స‌చిన్ టెండూల్కర్ – 18 ఏళ్ల 256 రోజులు (1992లో సిడ్నీలో)
రిష‌బ్ పంత్ – 21 ఏళ్ల 92 రోజులు (2019లో సిడ్నీలో)
నితీశ్‌కుమార్ రెడ్డి – 21 ఏళ్ల 216 రోజులు (2024లో మెల్‌బోర్న్‌లో)

ఈ ముగ్గురి కన్నా ముందు 1948వ సంత్సరంలో అడిలైడ్ లో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో అతి పిన్న వయసులో ఆస్ట్రేలియాపై సెంచరీ సాధించిన ఇండియన్ క్రికెటర్ గా దత్తు ఫడకర్ రికార్డు నెలకొల్పరు. అప్పుడు ఫడకర్ వయసు 22 సంవత్సరాల 46 రోజులు. 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com