ఏఐసీసీ కార్యాలయం నుంచి కొద్ది సేపటి క్రితం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంతిమ యాత్ర ప్రారంభమయ్యింది. శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఆయన నివాసం నుంచి మాజీ ప్రధాని భౌతిక కాయం అక్బర్ రోడ్డులోని ఏఐసీసీ కార్యాలయానికి చేరుకుంది. దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీలతో పాటు పలువురు సీనయర్ నాయకులు నివాళులు అర్పించారు. అనంతరం పది గంటల ప్రాంతంలో ఏఐసీసీ కార్యాలయం నుంచి మన్మోహన్ సింగ్ అంతిమ యాత్ర ప్రారంభమయ్యింది. అక్కడి నుంచి నిగమ్ బోధ్ ఘాట్ వరకూ మన్మోహన్ అంతిమ యాత్ర కొనసాగుతుంది. 11.45 గంటలకు మన్మోహన్ పార్థివదేహానికి నిగమ్ బోథ్ ఘాట్ లో అంతిమ సంస్కారాలు జరుగుతాయి. దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ అంతిమ సంస్కారాలలో ప్రభుత్వం తరపున ప్రధాని నరేంద్రమోడీతో పాటు, రక్షణ శాఖ మంత్రి, సహాయ మంత్రి, త్రివిధ దళాల అధిపతులులతో పాటు పలువురు కేంద్ర మంత్రులు కాంగ్రెస్ అగ్రనేతలు పాల్గొననున్నారు.