కేంద్ర క్యాబినేట్ నిర్ణయం
దేశ ఆర్థికాభివృద్ధికి పునాది వేసిన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ జ్ఞాపకార్ధం స్మారక చిహ్నం కోసం స్ధలం కేటాయించాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, ఎంపీ సుధాంశు త్రివేది తెలిపారు. మాజీ ప్రధాని మృతి తరవాత శుక్రవారం జరిగిన అత్యవసర కేంద్ర క్యాబినేట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సుధాంశు చెప్పారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ, ఎన్‌డీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ కు తగిన గౌరవం ఇవ్వడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాయన ప్రకటించారు. దేశ ఆర్థికాభివృద్ధికి పునాది వేసిన వ్యక్తిగా మన్మోహన్ సింగ్ జ్ఞాపకార్ధం స్మారక చిహ్నం, సమాధి నిర్మించాలని నిన్న జరిగిన మంత్రివర్గం సమావేశంలో నిర్ణయించి ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీకి తెలియజేశామని సుధాంశు త్రివేది వెల్లడాంచారుజ స్మారక చిహ్నం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, భూసేకరణ, ట్రస్ట్ ఏర్పాటు, భూ బదలాయింపు వంటి ప్రక్రియలు పూర్తయ్యాక ఎంత సమయం పట్టినా పనులు సక్రమంగా జరుగుతాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు యూనియన్ హెచ్‌ఎం అమిత్ షా చెప్పారని బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది స్పష్ట చేశారు.