32.2 C
Hyderabad
Sunday, April 19, 2026

Live Video

spot_img

ఫార్ములా ఈ కార్ కేసులో ఈడీ సమన్లు

ఫార్ములా ఇ రేస్ కేసులో ఉచ్చు బిగుస్తోంది. కేసుకు సంబంధించి సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్‌ఎన్ రెడ్డితో పాటు బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటి రామారావు (కెటిఆర్)లకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) సమన్లు జారీ చేసింది. జనవరి 2, 3 తేదీల్లో అరవింద్ కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డి హాజరుకావాల్సి ఉండగా, జనవరి 7న కేటీఆర్ హాజరుకావాల్సి ఉంది. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద విచారణ జరుగుతోంది. కేసుకు సంబంధించి వివరాలు అందించాలని ఈడి ఇదివరకే ఏసిబీని కోరింది. ఏసిబి ఎఫ్ ఐ ఆర్ ఆధారంగా ఈడి సమన్లు జారీ చేసిందని సమాచారం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com