విభజన సమస్యలపై చర్చించడానికి తమ సిద్ధంగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. ఈనెల ఆరవ తేదీన చర్చించుకోవడానికి ప్రజా భవన్‌కి రావాలని రేవంత్ రెడ్డి చంద్రబాబును ఆ లేఖలో ఆహ్వానించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై చర్చించుకుందామని సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. రెండు రాష్ట్రాల అభివృద్ధికి సంక్షేమానికి పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు రెండు రాష్ట్రాల లక్ష్యాలను సాధించడానికి సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని కూడా చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పది సంవత్సరాల దాటిన ఇంకా విభజన సమస్యలు అలాగే ఉన్నాయని వాటిని తక్షణం పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని ఆ లేఖలో చంద్రబాబు గుర్తు చేశారు. చంద్రబాబు లేఖకు జవాబుగా సీఎం రేవంత్ రెడ్డి ఆరవ తేదీన ప్రజాభవన్‌లో చర్చలకు ఆహ్వానిస్తూ ప్రత్యుత్తరం రాశారు.
- Advertisement with us -