40.2 C
Hyderabad
Monday, May 25, 2026

Live Video

spot_img

కోహ్లీకి కోపమొచ్చింది..

విరాట్ కోహ్లీ గ్రౌండ్‌లో ఎంత అగ్రెసివ్‌గా ఉంటాడో అందరికి తెలిసింది. కానీ అదే నార్మల్‌ లైఫ్‌లో మాత్రం చాలా కూల్‌గా, ఫన్నీగా కనిపిస్తాడు. కానీ ఫ్యామిలీ విషయంలో మాత్రం ఎవరైనా జోక్యం చేసుకుంటే గబ్బాలో గబ్బర్‌లా రెచ్చిపోయే కోహ్లీని చూడాల్సి వస్తుంది. ఇప్పుడీ మాటలను నిజం చేస్తూ ఓ రిపోర్టర్‌పై ఫైర్ అయ్యాడు. అది కూడా తన పర్మిషన్ లేకుండా తన ఫ్యామిలీ ఫోటోలు తీసినందుకు.

ఫ్యామిలీ విషయంలో చాలా గోప్యత మెయింటేన్ చేస్తాడు కోహ్లీ. తన పిల్లల ఫోటోలను ఇప్పటి వరకు అఫిషియల్‌గా ఎక్కడా రిలీజ్ చేయలేదు తను. అయితే నాలుగో టెస్ట్‌ కోసం మెల్‌బోర్న్‌కు చేరుకున్న కోహ్లీకి లోకల్ మీడియా నుంచి షాక్ తగిలింది. తన ఫోటోలతో పాటు… తన పిల్లల ఫోటోలను తీసింది అక్కడే ఉన్న ఓ జర్నలిస్ట్. దీంతో వారి వద్దకు వెళ్లి తన పర్మిషన్‌ లేకుండా ఎలా ఫోటోలో తీస్తారని ప్రశ్నించాడు కోహ్లీ. అంతేకాదు తీసిన ఫోటోలను వెంటనే డిలీట్ చేయాలని కోరాడు. అయితే పర్సనల్ ఫోటోలు తీయలేదని చెప్పగానే అక్కడి కెమెరామన్‌కు షేక్‌ హ్యాండ్ ఇచ్చి వెళ్లాడు.

నిజానికి ఆస్ట్రేలియా పేసర్ స్కాట్ బోలాండ్‌ను ఇంటర్వ్యూ చేస్తుండగా కోహ్లి తన ఫ్యామిలీతో ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. అంతే అక్కడున్న కెమెరాలన్ని అతని వైపు తిరిగాయి. వెంటనే వారి వద్దకు వెళ్లి మాట్లాడాడు కోహ్లీ.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com