ట్యాలెంటెడ్ హీరో శివకార్తికేయన్ మరియు జయం రవి, అథర్వ, శ్రీలీల వంటి ట్రెండింగ్ హీరో హీరోయిన్లతో వస్తూన్న చిత్రం.. #SK25.. తన మైల్ స్టోన్ 25వ మూవీ కోసం ప్లాన్ చేశారు హీరో శివకార్తికేయన్నే . ఆ చిత్రంతో అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సుధా కొంగరతో కొలాబరేట్ అవుతున్నారు. ఈ హైలీ యాంటిసిపేటెడ్ మూవీలో జయం రవి, అథర్వ, శ్రీలీల కీ రోల్స్ పోషించనున్నారు. ఈ చిత్రాన్ని డాన్ పిక్చర్స్ బ్యానర్ పై ఆకాష్ బాస్కరన్ గ్రాండ్ గా నిర్మించనున్నారు. ఈ మచ్ అవైటెడ్ మూవీని మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు.
మా ప్రొడక్షన్ నెం.2 చిత్రాన్ని తన అసాధారణ నటనతో ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ప్రతిభావంతుడైన హీరో శివకార్తికేయన్ తో గ్రాండ్ గా నిర్మిస్తునందుకు ఆనందంగా వుందన్నారు నిర్మాత ఆకాష్ బాస్కరన్. శివకార్తికేయన్ 25వ చిత్రాన్ని నిర్మించడం మాకు గొప్ప సంతోషాన్ని ఇస్తోంది. ఈ మైల్ స్టోన్ ప్రాజెక్ట్ జాతీయ అవార్డు-విన్నర్ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వం వహించడం విషేషం. ఇది అత్యంత భారీ అంచనాల చిత్రాలలో ఒకటిగా నిలుస్తోందని. అసాధారణమైన కథలను ఎంచుకునే నటులు జయం రవి, అథర్వ, శ్రీలీల ఈ ప్రాజెక్ట్‌లో చేతులు కలపడం మాకు సంతోషంగా ఉందన్నారు నిర్మాత.
ప్రతిష్టాత్మకగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి కె. చంద్రన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా, సెన్సేషనల్ కంపోజర్ జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చనున్నారు. ఇది G.V. ప్రకాష్‌కి 100వ సినిమా కావడం మరింత ప్రత్యేకం. #SK25 యూనిక్ థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుందని మీకు హామీ ఇస్తున్నామన్నారు చిత్ర యూనిట్ సభ్యులు.