వెంకటేశ్ అయ్యర్.. ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్స్‌లో ఒకడు. ఐపీఎల్-2025 మెగా వేలంలో ఏకంగా రూ.23.75 కోట్ల భారీ ధరకు కోల్‌కతా నైట్ రైడర్స్ అయ్యర్‌ను దక్కించుకుంది. కానీ అయ్యర్ క్రికెటర్ మాత్రమే కాదు.. కాబోయే డాక్టర్ చాలా మందికి ఖచ్చితంగా తెలిసి ఉండదు. కానీ ఇది నిజం. క్రికెట్‌తో పాటు తన చదువును కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు అయ్యర్. అయితే డాక్టర్ అంటే ప్రజలకు ట్రీట్మెంట్ చేసే డాక్టర్ మాత్రం కాదు. తను ఫైనాన్స్‌లో పీహెచ్డీ చేస్తున్నాడు. అంతేకాదు చదువు విషయంలో తనో మంచి ఫిలాసఫి కూడా చెప్పాడు. తానొక సంప్రదాయక కుటుంబానికి చెందినవాడినని, క్రికెట్‌ను మాత్రమే కొనసాగిస్తానంటే మధ్యతరగతి తల్లిదండ్రులు ఒప్పుకోవడం కష్టమంటున్నాడు అయ్యార్. అంతేకాదు మనం క్రికెట్‌ను ఎక్కువకాలం ఆడలేమని కూడా చెబుతున్నాడు.
మధ్యప్రదేశ్ జట్టులోకి కొత్తగా ఏ ఆటగాడైనా వస్తే చదువుతున్నావా? లేదా? అని ఫస్ట్ క్వశ్చన్ చేస్తాడట అయ్యర్. చనిపోయే వరకు చదువు తోడుగా ఉంటుంది. ఒక క్రికెటర్ 60 సంవత్సరాల వరకు ఆడలేడు కదా… క్రికెట్ తర్వాత జీవితం ఉంటుందని అర్థం చేసుకోవాలి.. అందుకే అందరూ చదువుకోవాలి అని చెబుతున్నాడు.
ఎంబీఐ పూర్తి చేసిన అయ్యర్.. ఆ తర్వాత క్రికెట్‌పై ఇష్టంతో MNCలో మంచి జాబ్ ఆఫర్ వచ్చినా వదులుకున్నాడట. కెరీర్లో ఎప్పుడే నిర్ణయం తీసుకోవాలనేది తెలుసుకోవాలని.. లేదంటే తప్పటడుగులు వేయాల్సి వస్తుందంటున్నాడు అయ్యర్. ఏదేమైనా త్వరలోనే డాక్టర్ వెంకటేష్ అయ్యర్ అనే బోర్డు పెట్టుకునేందుకు రెడీ అవుతున్నాడు. ఓవరాల్‌గా చూస్తే అయ్యర్ క్రికెట్లో అయ్యర్ బ్లాస్టింగ్ బ్యాట్స్‌మెన్.. చదువులో ఓ మాస్టర్.