25.7 C
Hyderabad
Thursday, August 27, 2026

Live Video

spot_img

రాజ్యసభ ఛైర్మన్ పై అవిశ్వాస తీర్మానం

రాజ్యస‌భ చైర్మెన్ జ‌గ‌దీప్ ధ‌న్‌క‌డ్‌పై.. అవిశ్వాస తీర్మానానికి ఇండియా కూటమి సిద్దం అయింది. ఎగువ స‌భ‌లో చైర్మ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు ఏక‌ప‌క్షంగా ఉంటున్న‌ట్లు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అవిశ్వాస తీర్మానంపై 70 మంది ఎంపీలు సంతకాలు చేశారు. చైర్మన్ విపక్షాలతో గొడవపడటమే పనిగా పెట్టుకున్నారని కూటమి ఎంపీలు విమర్శిస్తున్నారు.

అవిశ్వాస తీర్మానంపై ఇండియా కూట‌మి పార్టీ నేత‌లు మ‌మ‌తా బెన‌ర్జీ, అర‌వింద్ కేజ్రీవాల్‌, అఖిలేశ్ యాద‌వ్ సంత‌కం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్‌67(బి) కింద ఆ తీర్మానాన్ని స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు.

రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 240 కాగా… బీజేపీకి 97 మంది సభ్యులు ఉన్నారు. ఎన్డీఏ పార్టీలతో కలిపి అధికార పార్టీకి 117 ఎంపీల బలం ఉంది. కాంగ్రెస్‌ పార్టీకి 29, తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీకి 13 మంది, డీఎంకే 10, ఆమ్ ఆద్మీ పార్టీలకు 10 మంది, బీజేడీ 9, వైఎస్ఆర్సీపీ 9, బీఆర్ఎస్‌ 7, ఆర్జేడీ 6, సీపీఎం 5, ఏఐడీఎంకే 1, జేడీయూకు ఒక చొప్పున రాజ్యసభ ఎంపీలు ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com