కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో ఐదుగురు ఎంబీబీఎస్ విద్యార్థులు చనపిఓయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అలప్పుజలో జరిగిన ఈప్రమాదంలో కారు, బస్సు ఢీకొన్నాయి. బస్సు అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులుచెబుతున్నారు. బాధితులను వందనం మెడికల్ కళాశాలలో చదువుతున్న ముహ్సిన్, మహమ్మద్, ఇబ్రహీం, దేవన్గా గుర్తించారు. ప్రమాదానికి కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జు అయ్యింది. తీవ్ర గాయాలైన ఇద్దరు స్టూడెంట్లను అలప్పుజ జిల్లా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.