35.2 C
Hyderabad
Friday, May 1, 2026

Live Video

spot_img

ట్రంప్ హెచ్చరికతో కెనడా ప్రధాని దిగొచ్చాడా?

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అమెరికా బాట పట్టేందుకు రెడీ అయ్యారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ చార్జ్ తీసుకున్న వెంటనే కెనడా, మెక్సికో, చైనా వస్తువులపై భారీగా పన్నులు విధిస్తానని ప్రకటించారు. దీంతో ఈ విషయంపై చర్చించేందుకు ట్రూడో అమెరికా రానున్నారు. ఫ్లోరిడాలోని ట్రంప్‌నకు చెందిన మార్‌-ఎ-లాగో ఎస్టేట్‌లో ఈ సమావేశం జరుగనుంది. అయితే ఈ భేటీకి సంబంధించి కెనడా ప్రధాని కార్యాలయం ఎలాంటి ప్రకటన చేయలేదు.

అమెరికాలోకి అక్రమ వలసలు, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ నివారించాలంటే కీలక చర్యలు తప్పవంటున్నారు ట్రంప్. మెక్సికో, కెనడాల నుంచి వచ్చే ప్రతి వస్తువుపై 25 శాతం పన్ను విధించే ఉత్తర్వులపై జనవరి 20 సంతకం చేస్తానని ట్రంప్ చెప్పారు. ఫెంటానిల్ స్మగ్లింగ్‌ను చైనా అరికట్టే వరకు ఆ దేశం నుంచి వచ్చే వస్తువులపై అదనంగా 10 శాతం సుంకం విధించాలనుకుంటున్నట్లు తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com