ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా ఎన్నికైన శాసనసభ్యుల అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై సభ్యులకు దిశానిర్దేశం చేయాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు.. ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఉదయం ఢిల్లీ పార్లమెంటు హౌజ్‌లో ఓం బిర్లాను కలిసిన స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పలు అంశాలపై ఆయనతో చర్చించారు. ఎమ్మెల్యేల అవగాహన కార్యక్రమానికి తప్పకుండా వస్తానని, ఈ సందర్భంగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. అలాగే, ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేలా లోక్‌సభ తరపున కూడా అన్నిరకాలుగా సహకారం అందిస్తామన్నారు.
- Advertisement with us -