30.2 C
Hyderabad
Wednesday, June 24, 2026

Live Video

spot_img

ఎస్‌-400 ఎయిర్‌ డిఫెన్స్‌ మిస్సైల్‌ సిస్టమ్‌ లు మరిన్ని కావాలి

  • రష్యాను కోరిన భారత్‌…
  • సానుకూలంగా స్పందించిన రష్యా

పాకిస్తాన్‌ ద్రోణ్లని తుత్తునీయలు చేసిన ఎస్‌400 ఎయిర్‌ డిఫెన్స్‌ మిస్సైల్‌ సిస్టమ్‌ లను మరిన్ని సమకూర్చుకోవాలని భారత్‌ భావిస్తోంది. ఈ మేరకు అదనపు యూనిట్లను రష్యా నుంచి దిగుమతి చేసుకోవడానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు సమాచారం. పహల్గామ్‌ ఉగ్రదాడికి ప్రతిగా భారత్‌ పీఓకే, పాకిస్తాన్‌ భూభాగంపై ఉన్న ఉగ్రవాద స్ధావాలను వైమానిక దాడులు చేసి మట్టుపెట్టింది. ఈ దాడుల్లో వంద మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయారు. వారిలో లష్కరే తోయిబా, జైషే మహమ్మద్‌ ఉగ్రవాద సంస్ధలకు చెందిన కీలక నేతలు కూడా ఉన్నారు. దీంతో ఉక్రోషం ఆపుకోలేని పాకిస్తాన్‌ టర్కీ నుంచి దిగుమతైన ద్రోణ్లతో భారత్‌ మీద దాడులు చెయ్యడానికి ప్రయత్నించింది. ఎస్‌ 400 ఎయిర్‌ డిఫెన్స్‌ మిస్సైల్‌ సిస్టమ్‌ సహాయంతో ఈ ద్రోణ్లను ఆకాశంలోనే నిర్వీర్యం చేశాయి భారత్‌ రక్షణ దళాలు. పాకిస్తాన్‌ ప్రయోగించిన ద్రోణ్ల వల్ల ఒక్క ప్రమాదం కూడా మన దేశంలో సంభవించకుండా ఎస్‌ 400 ఎయిర్‌ డిఫెన్స్‌ మిస్సైల్‌ సిస్టమ్‌ విజయవంతంగా కాపాడింది. ఖచ్చితత్వంతో సరిహద్దు నుంచి వైమానిక ముప్పును ఎదుర్కోవడంలో ఈ ఎస్‌ 400 వ్యవస్థ సమర్థవంతంగా పని చేసిన నేపథ్యంలో.. భారత్‌ తన వైమానిక రక్షణ సామర్థ్యాన్ని మరింత విస్తరించేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో ఎస్‌400 అదనపు యూనిట్లు కావాలని భారత దేశం రష్యాను కోరింది. ఈ విషయాన్ని రక్షణ వర్గాలు వెల్లడించినట్లు జాతీయ మీడియా వార్తలను ప్రసారం చేసింది. భారత్‌ చేసిన విజ్ఞప్తికి రష్యా అంగీకరించే అవకాశం ఉందని రక్షణ వర్గాలు అంటున్నాయి. రష్యాలో తయారు చేసిన S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను భారత్‌లో ‘సుదర్శన్ చక్ర’గా పిలుస్తూ వస్తున్నారు. ఎస్‌-400 ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన మొబైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. దీన్ని సులభంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించేందుకు అవకాశం ఉంటుంది. దాన్ని ఓ వాహనంపై అమర్చవచ్చు. ఒకేసారి మల్టిపుల్‌ టార్గెట్స్‌ని ధ్వంసం చేస్తుంది.ఒకేసారి 36 టార్గెట్‌లను ట్రాక్‌ చేసే సామర్థ్యం దీనికి ఉంది. అలాగే, 12 టార్గెట్స్‌పై ఒకే సారి దాడి చేస్తుంది. 600 కిలోమీటర్ల దూరం నుంచే ట్రాక్‌ చేస్తూ.. 400 కిలోమీటర్ల పరిధిలోనే శత్రువుల మిస్సైల్స్‌ను కూల్చే సత్తా వీటి సొంతం. విమానాలు, డ్రోన్లు, క్రూయిజ్ మిసైల్స్‌, బాలిస్టిక్ మిసైల్స్‌ ఇలా వేర్వేరు లక్ష్యాలను ఒకేసారి టార్గెట్‌ చేసి ఛేదిస్తుంది. వీటిని రియాక్షన్‌ టైమ్‌ చేలా వేగంగా ఉంటుంది. ఎస్‌-400 యాంటీ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్‌ను ఫైర్‌ చేసేందుకు ఐదు నిమిషాల్లోనే రెడీ చేయొచ్చు. ఇందులో 3డీ ఫేజ్‌డ్ అరే రాడార్‌ ట్రాకింగ్ సిస్టమ్‌ ఉంటుంది. ఈ మిస్సైల్‌ సిస్టమ్‌ కోసం భారత్‌ సుమారు రూ.35వేలకోట్లతో రష్యాతో ఒప్పందం చేసుకుంది. ఇప్పటి వరకు ఐదు యూనిట్లు డెలివరీ తీసుకుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com