-
దాడుల తర్వాత త్రివిధ దళాధికారుల వివరణ
-
మనం చేసినది దాడికి ప్రతిదాడి మాత్రమే
-
కేవలం ఉగ్రశిబిరాల ధ్వంసానికే పరిమితం
-
వారి వల్ల మనల్ని దెబ్బతీశామన్నది బూటకం
-
మన ఆయుధ వ్యవస్థలన్నీ భేషుగ్గా ఉన్నాయ్
-
ఇప్పుటికిప్పుడు యుద్ధానికైనా మేం సిద్ధం
-
డీజీఎంఓల హాట్ లైన్ భేటీలో మార్పు
ఆపరేషన్ సింధూర్ వల్ల ఏదైనా నష్టం జరిగి ఉంటే అది పాకిస్థానీ మిలటరీ వల్లనే జరిగింది తప్ప తమ ఆపరేషన్ వల్లకాదని భారత ఆర్మీ ప్రకటించింది. తాము పాకిస్థాన్ లోని టెర్రర్ క్యాంపులను ధ్వంసం చేయడానికే పరిమితమయ్యామని తెలిపింది. మా ఉద్దేశం తీవ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడమే. అందుకే సిందూర్ తో ఆ పని పూర్తి చేశాం.పాకిస్థాన్ మిలటరీ తీవ్రవాదులను కాపాడుకోడమే ధ్యేయంగా పోరాడిందని ఇది సిగ్గుచేటైన విషయమని భారత్ ప్రకటించింది. పాక్ మనపై కాల్పులకు తెగబడినందునే కౌంటర్ కాల్పులు జరపాల్సి వచ్చిందని ఎయిర్ మార్షల్ ఏ.కె.భర్తి అన్నారు.భారత వాయుదళ వ్యవస్థ సరిహద్దుల దగ్గర ఒక గోడలా అడ్డుగా నిలిచిందని,శతృ దుర్భేధ్యంగా మారిందని అందుకే పాకిస్థాన్ కు చొరబడటానికి సాధ్యం కాలేదని సీనియర్ అధికారి తెలిపారు. భారత ఆర్మీ పౌరులకు, మిలటరీ స్థావరాలకు, మౌలిక సదుపాయాలకు తక్కువ నష్టం కలిగేలా వ్యూహాత్మకంగా, అత్యంత జాగ్రత్తగా వ్యవహరించిందని డైరక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘయ్ ఇతర సీనియర్ అధికారులు తెలిపారు.
కనీసం దగ్గరగా కూడా రాలేరు..
ఏ శత్రు విమానం భారత భూభాగానికి వంద కిలోమీటర్ల పరిధిలోకి కూడా రాకుండా అడ్డుకున్నామని ఎయిరల్ మార్షల్ ఎ.కె. భర్తి తెలిపారు.పాకిస్థాన్ దళాలు మనపై దాడి చేసి దెబ్బ తీశామని చెప్పుకుంటున్నాయని, మన యుద్ద పరికరాలకు, ఆయుధాలకు కించిత్తు నష్టం కూడా జరగలేదని అన్ని వ్యవస్థలు ప్రతి దాడికి ఇప్పటికీ సిద్ధంగా ఉన్నాయని భర్తి తెలిపారు. ఈసందర్భంగా ఆయన రామ చరిత మానస్ లోని ఒక శ్లోకాన్ని కూడా కోట్ చేశారు. గగనతలంలో ఇప్పటికీ మనదే పై చేయి అని ప్రకటించారు. మరోవైపు ప్రధాని ఇంట ఇవాళ ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. త్రివిధ దళాధిపతులు, విదేశాంగ మంత్రి జయశంకర్, రక్షణ మంత్రి రాజ్ నాథ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.