25.2 C
Hyderabad
Monday, November 23, 2026

Live Video

spot_img

డ్రగ్స్ కేసులో డాక్టర్ చిగురుపాటి నమ్రత అరెస్ట్

హైదరాబాద్  పోలీసులు శుక్రవారం డ్రగ్స్ రాకెట్ లో కీలక వ్యక్తుల్ని అరెస్టు చేశారు. ఓ యువతి..మరొకరు డ్రగ్స్ కొరియర్. పక్కా సమాచారంతో డ్రగ్స్ డెలివరీ తీసుకుంటున్నప్పుడు అరెస్టు చేశారు. ఆమె ఎవరో తెలుసుకుని పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. హైదరాబాద్ లోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రి ఓమెగా హాస్పిటల్ యజమాని చిగురుపాటి మోహన వంశీ కుమార్తి. ప్రముఖ వైద్యుడిగా పేరొందిన మోహన వంశీ కుమార్తె చిగురుపాటి నమ్రత కూడా స్వయంగా డాక్టర్.

నమ్రత ఓమెగా ఆస్పత్రి సీఈవోగా కూడా వ్యవహరిస్తున్నారు. పోలీసులు ఆమెను పట్టుకున్నప్పుడు ఐదు లక్షల రూపాయల విలువైన సరుకును డెలివరీ తీసుకుంటోంది.  ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. రిమాండ్ కు తరలించారు. కానీ ఆమె పరిస్థితి చూసి.. రిహాబిలిటేషన్ సెంటర్ కు తరలించాల్సి  వచ్చింది. ముంబైలోని ఓ పబ్ లో ఆమెకు డ్రగ్స్ అలవాటు అయ్యాయి. డాక్టర్ నమ్రత ముంబై నుండి వాట్సాప్ ద్వారా వంశ్ ధక్కర్‌ను సంప్రదించి రూ.5 లక్షల విలువైన కొకైన్ ఆర్డర్ చేశారు. ఈ మొత్తాన్ని ఆన్‌లైన్‌లో బదిలీ చేసి, వంశ్ కింద పనిచేస్తున్న డెలివరీ ఏజెంట్ బాలకృష్ణ అలియాస్ రాంప్యార్ రామ్  ద్వారా హైదరాబాద్‌కు డ్రగ్స్‌ను డెలివరీ చేశారు.

సమాచారం అందడంతో రాయదుర్గం పోలీసులు వేకువజామున  5:20 గంటల ప్రాంతంలో మాదకద్రవ్యాలను అందజేసేటప్పుడు నమ్రత ,బాలకృష్ణ ఇద్దరినీ అరెస్టు చేశారు. వారు 53 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనుమానితుల నుండి 53 గ్రాముల కొకైన్, రూ.10,000 నగదు మరియు రెండు మొబైల్ ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో డాక్టర్ నమ్రత ఏడాదిలో  దాదాపు రూ.70 లక్షలు డ్రగ్స్ కోసం ఖర్చు చేసినట్లు అంగీకరించారు. ధనవంతుల కుటుంబం కావడంతో చేతిలో కావాల్సినంత డబ్బు ఉండటంతో దాన్ని దురలవాట్ల కోసం మహిళా వైద్యురాలు ఉపయోగించడం ప్రారంభించారు. ముంబైలోని ఓ పబ్ లో పరిచయమైన వ్యక్తితో డ్రగ్స్ అలవాటు  అయిందని… క్రమంగా వ్యసనంగా మారిందని పోలీసుల విచారణలో నమ్రత చెప్పినట్టు సమాచారం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com