25.7 C
Hyderabad
Saturday, April 18, 2026

Live Video

spot_img

కొత్త పాన్ కార్డులపై స్పష్టత ఇచ్చిన కేంద్రం

కేంద్ర మంత్రివర్గం సోమవారం సంచలన నిర్ణయం తీసుకుంది. పాన్ కార్డు విషయంలో మంత్రివర్గం కీలక నిర్ణయానికి ఆమోదం తెలిపింది. పాన్ 2.0కి కేంద్ర కెబినెట్ ఆమోదం తెలిపింది. ఇది QR కోడ్‌తో పాన్ కార్డ్‌కు ఉచితంగా అప్‌గ్రేడ్ చేయబడుతుందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.

అధికారిక ప్రకటన ప్రకారం.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCEA), ఆదాయపు పన్ను శాఖ యొక్క పాన్ 2.0 ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలిపింది. రూ.1,435 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టు చేపట్టారు.

PAN 2.0 ప్రాజెక్ట్ అంటే ఏమిటి?
PAN 2.0 ప్రాజెక్ట్ అనేది పన్ను చెల్లింపుదారులకు మరిత మెరుగైన డిజిటల్ అనుభవం కోసం PAN/TAN సేవల సాంకేతిక పరివర్తన ద్వారా పన్ను చెల్లింపుదారుల రిజిస్ట్రేషన్ సేవల వ్యాపార ప్రక్రియలను రీ-ఇంజనీరింగ్ చేయడానికి ఇ-గవర్నెన్స్ ప్రాజెక్ట్ లో భాగం.

అయితే పాత పాన్ కార్డులు ఉన్నవారికి ఇబ్బంది లేదని, వారు వాటినే కొనసాగించవచ్చని కేంద్రం ఈ రోజు స్పష్టత ఇచ్చింది. పాత కార్డులో తప్పులు సరిదిద్దుకునేందుకు వెళ్ళే వారికి కొత్త కార్డులు ఇస్తారని… కరెక్షన్స్ ఉచితంగా చేస్తారని ప్రకటించింది. కొత్తగా పాన్ కార్డ్ దరఖాస్తు చేసేవారికి మాత్రం పాన్ 2.0 వర్తిస్తుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com