36.2 C
Hyderabad
Saturday, May 2, 2026

Live Video

spot_img

పహల్గామ్ దాడి వెనుక ఐఎస్ఐ… లష్కరే తోయిబా

  • కీలక ఆధారాలు సేకరించిన ఎన్ఐఏ
  • రష్యా పర్యటన రద్దు యోచనలో రాజనాథ్ సింగ్
  • యుద్ద సన్నాహకాలు కొనసాగిస్తున్న త్రివిధ దళాలు

భారత్‌ పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.. సరిహద్దుల్లో పాక్ కవ్వింపులు కొనసాగుతూనే ఉన్నాయి.. ఇవన్నీ జరుగుతున్న సమయంలో కేంద్రం తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారాయి. మరోవైపు పహెల్‌గామ్‌ ఉగ్రదాడికి సంబంధించిన కీలక వివరాలను రాబట్టింది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ.ఈ ఉగ్రదాడుల్లో ISI, లష్కరే తొయిబా ఇన్‌వాల్వ్‌మెంట్‌ ఉన్నట్టు గుర్తించారు. పాక్ ISI డైరెక్షన్‌లో లష్కరే తొయిబా దాడులకు స్కెచ్ వేసినట్టు గుర్తించారు. NIA ప్రైమరీ రిపోర్ట్‌లో ఈ విషయాలన్ని బయటికి వచ్చాయి.

పక్కా ప్లానింగ్ టైమింగ్ ప్రకారమే ఈ దాడులు జరిగినట్టు NIA చెబుతోంది. ఈ ఉగ్రదాడులకు ఓవర్‌ గ్రాండ్ వర్కర్స్ సహకరించినట్టు కూడా తేల్చారు. ఇప్పటి వరకు 2,800 మందిని విచారించింది. 150 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తోంది. వీరిలో చాలా మంది OGWలు ఉన్నట్టు అనుమానాలున్నాయి. వీరే ఈ దాడులకు సంబంధించి లాజిస్టిక్ సపోర్ట్‌తో పాటు.. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చినట్టు అనుమానిస్తున్నారు.

మరోవైపు త్రివిధ దళాలు యుద్ధ సన్నాహాలు కొనసాగిస్తున్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎక్స్‌ప్రెస్ హైవేలపై టచ్ అండ్ గో డ్రిల్‌ను నిర్వహిస్తున్నాయి. మరోవైపు ప్రధాని మోడీతో సహా అనేక మంది కేంద్రమంత్రులు ఉగ్రవాదులకు, వారిని వెనకుండి నడిపిస్తున్న వారికి డెడ్లీ వార్నింగ్ ఇస్తున్నారు. ఇదే సమయంలో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తన రష్యా పర్యటనను రద్దు చేసుకునే ఆలోచనలో ఉన్నారు. దీంతో కేంద్రం ఏదో భారీగానే చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది.

మే 9న రష్యాలో జరిగే విక్టరీ డే పరేడ్‌ జరుగుతుంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి రావాలంటూ ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఆహ్వానం అందింది. అయితే పహెల్‌గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో మోడీ ఈ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆయనకు బదులుగా రాజ్‌నాథ్‌ సింగ్‌ వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఆయన కూడా వెళ్లేందుకు అవకాశం లేదని తెలుస్తోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com