మంగళవారం ప్రకటించిన పదో తరగతి ఫలితాల్లో హైదరాబాద్ మణికొండలోని శ్రీ గాయత్రి ఈ టెక్నో స్కూల్ విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచారు. వందకు వందశాతం విద్యార్థులు ఎస్సెస్సీలో పాసయ్యారు. అది కూడా అందరికీ జీపీఎ 7 కంటేఎక్కువే మార్కులు వచ్చాయి. దీంతో, యాజమాన్యం సంతోషం వ్యక్తం చేసింది. స్కూల్లో మొత్తం 44 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయగా.. ఏడుగురు విద్యార్థులు జీపీఎ 10కి 10 మార్కులు సాధించారు. అలాగే, 17 మంది విద్యార్థులు జీపీఏ 9 సాధించగా.. 14 మంది స్టూడెంట్స్ 8 జీపీఎ మార్కులు పొందారు. మిగిలిన ఆరుగురు విద్యార్థులు జీపీఏ 7 మార్కులు సాధించారు.
మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, ఉత్తమ మార్కులు స్కోర్ చేసిన స్టూడెంట్స్ను పాఠశాల కరస్పాండెట్ మధుసూదన్, డైరెక్టర్ సమి, సీఈవో సర్వేష్, ప్రిన్సిపల్ రచన అభినందించారు. తమ స్కూల్లో విద్యార్థులకు బట్టీ చదువులు కాకుండా.. మానసికంగా ఒత్తిడి కలిగించని రీతిలో విద్యాబోధన అందిస్తున్నామని, అందుకే విద్యార్థులందరూ ఉత్తమ ప్రతిభను చూపారని నిర్వాహకులు పేర్కొన్నారు.