22 C
Hyderabad
Friday, November 6, 2026

Live Video

spot_img

కశ్మీర్ ఉగ్రదాడి.. భారత్ నెక్ట్స్ స్టెప్ ఏంటి?

చాలా రోజులుగా ప్రశాంతంగా ఉన్న కశ్మీర్‌లో ఉగ్రవాదులు కలకలం రేపారు. కశ్మీర్ అందాలను చూసేందుకు వస్తున్న పర్యాటకుల సంఖ్య పెరగడం.. కశ్మీర్ అభివృద్ధి చెందడం వారికి నచ్చడం లేదు. అందుకే పర్యాటకులను టార్గెట్ చేసి ఈ మారణహోమాన్ని సృష్టించారు. ఇది సామాన్యులకు కూడా అర్థమవుతున్న విషయం. కానీ దాడి జరిగిపోయింది. పోయిన ప్రాణాలు ఇక తిరిగి రావు. కానీ పోయిన ప్రతీ ప్రాణానికి న్యాయం చేస్తామని ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్రమోదీ హామీ ఇచ్చారు. ఆయన సౌదీ పర్యటనను అర్థాంతరంగా ముగించుకొని ఇప్పటికే భారత్‌కు చేరుకొని ఉన్నతాధికారులతో సమీక్ష కూడా నిర్వహించారు. మరి భారత్ నెక్ట్స్ ఏం చేయబోతుంది? ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి? అనేది ఇప్పుడు అసలైన ప్రశ్న.

దాడి చేసిన ఉగ్రవాదులపైనే ఫోకస్ చేస్తారా?

కశ్మీర్ ఉగ్రదాడిలో పాల్గొన్నది ఆరు నుంచి ఏడు మంది అని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దాడి జరిగిన వెంటనే వారంతా అడవుల్లోకి పారిపోయారు. వారి కోసం ఇప్పటికే కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తోంది ఇండియన్ ఆర్మీ. పహెల్‌గామ్‌కు ఇప్పటికే భారీగా బలగాలు చేరుకొని సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టాయి కూడా. వారిని వేటాడమే ఫస్ట్‌ టార్గెట్‌గా పెట్టుకున్నాయి భద్రతా బలగాలు. ఇప్పటికే అన్యాయంగా 27 మంది అమాయక ప్రజలను పొట్టన పెట్టుకున్నారన్న కసి వారిలో కనిపిస్తోంది. దీంతో వారిని ఏరివేయడం పక్కాగా కనిపిస్తోంది. కానీ వారంతా ఇప్పటికే సరిహద్దులు దాటితే మాత్రం చేసేదేం లేదు.

మరో సర్జికల్ స్ట్రైక్ ఉంటుందా?

ఉగ్రదాడులు జరిగింది కశ్మీర్‌లో అయినా.. ప్లాన్ చేసింది పాకిస్థాన్‌లో.. ఆపరేట్ చేసింది పాక్ ఆక్రమిత కశ్మీర్ అని తెలుస్తోంది. ఇప్పటికే కశ్మీర్‌లో ల్యాండ్ అయిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దర్యాప్తును ప్రారంభించింది. దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను గుర్తించే పనిలో బిజీగా ఉంది. అయితే వివరాలను బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది భారత్. గతంలో కశ్మీర్‌లో జరిగిన ప్రతిదాడికి ఇండియన్ ఆర్మీ గట్టిగానే సమాధానం ఇచ్చింది. అలాంటింది కశ్మీర్‌ చరిత్రలోనే సామాన్య పౌరులపై ఉగ్రవాదులు చేసిన అతి పెద్ద దాడికి ప్రతీకారం తీర్చుకోకుండా ఉంటుందా? అనేది అసలు ప్రశ్న. ప్రస్తుతం దాడి చేసిన ఉగ్రవాదుల ఏరివేతపై ఫోకస్ చేస్తూనే.. దీని వెనకున్న మాస్టర్‌మైండ్‌ల గురించి ఆరా తీయడం ప్రారంభించింది. వారు ఎక్కడున్నా వారిని మట్టుపెట్టడమే ఇప్పుడు కేంద్రం పనిగా పెట్టుకుంటుందనేది మాత్రం పక్కా. అయితే దీనికి ఎంత కాలం పడుతుందనేది చూడాలి.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com