ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలువిడుదలయ్యాయి. ఈ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారుల సమక్షంలో విజయవాడలో ఉదయం 11 గంటలకు విడుదల చేశారు. సుమారు 6 లక్షల మంది విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూసిన ఫలితాలు ఇప్పుడు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి.
ఈ ఏడాది మార్చి 17 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా 3,450 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. మొత్తం 6,19,275 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, వారిలో 3,17,939 మంది బాలురు, 3,05,153 మంది బాలికలు ఉన్నారు.
ఫలితాల ప్రకారం, 6,14,459 మంది విద్యార్థుల్లో 4,98,585 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతం 81.14%గా నమోదయ్యింది. పార్వతీపురం మన్యం జిల్లా అత్యధికంగా 93.90% ఉత్తీర్ణతతో ముందంజలో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 1,680 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి.
ఉత్తీర్ణులైన విద్యార్థులను మంత్రి నారా లోకేశ్ అభినందించారు. ఫెయిలైన విద్యార్థుల కోసం మే 19 నుంచి 28 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.
విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్లు https://bse.ap.gov.in లేదా results.bse.ap.gov.in, https://results.bse.ap.gov.in ద్వారా లేదా వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు.
ఫలితాల్లో పేర్లు, వ్యక్తిగత వివరాలు, మార్కుల విషయాల్లో ఏవైనా పొరపాట్లు కనిపిస్తే వెంటనే అధికారులను సంప్రదించాలని విద్యాశాఖ సూచించింది.