22 C
Hyderabad
Friday, November 6, 2026

Live Video

spot_img

ఆంక్షలు తప్పించుకునేందుకు చైనా ఎత్తుగడ

అమెరికా సుంకాల భారం తప్పించుకునేందుకు చైనా కొత్త దారులు వెతుకుతోంది. అమెరికా చైనాపై 245 శాతం ప్రతీకార సుంకాలు విధించింది. ప్రపంచ వ్యాప్తంగా సుంకాల అమలు మూడు నెలలు వాయిదా వేసినా.. చైనాపై మాత్రం అమలు చేస్తోంది. దీంతో టారిఫ్‌ల భారం తప్పించుకునేందుకు చైనా అడ్డదారులు వెతుకుతోంది. ఇటీవల దక్షిణ కొరియాపై అమెరికా 25% టారిఫ్‌లు విధించింది. అయితే ఈ టారిఫ్‌లు ప్రస్తుతం అమలులోకి రాలేదు. దీంతో చైనా తన ఉత్పత్తులను ‘మేడ్ ఇన్ కొరియా’ అని లేబుల్ వేసి అమెరికా మార్కెట్‌లోకి చొప్పించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ చర్య ద్వారా చైనా ఉత్పత్తులు తక్కువ టారిఫ్‌లతో అమెరికాలోకి ప్రవేశించే అవకాశం ఉంది.

ఇది దక్షిణ కొరియా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపవచ్చు. దక్షిణ కొరియా కస్టమ్స్ అధికారులు ఈ సమస్యను గుర్తించి, అమెరికా అధికారులతో సంయుక్తంగా దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు ద్వారా చైనా ఉత్పత్తులపై తప్పుడు లేబులింగ్‌ను అడ్డుకోవడం, అలాగే అంతర్జాతీయ వాణిజ్య నిబంధనల ఉల్లంఘనను నిరోధించడం లక్ష్యంగా ఉంది. ఈ సమస్య వల్ల దక్షిణ కొరియా ఉత్పత్తుల పరిశ్రమలకు ఆర్థిక నష్టం, అమెరికాతో వాణిజ్య సంబంధాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.

చైనా తప్పుడు వ్యూహాలతో అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు భంగం వాటిల్లే ప్రమాదం ఏర్పడింది. ప్రపంచ వాణిజ్య సంస్థ  నిబంధనల ప్రకారం, ఉత్పత్తి యొక్క మూలం స్పష్టంగా తెలియజేయాలి. చైనా ఈ నిబంధనలను ఉల్లంఘిస్తూ, తప్పుడు లేబులింగ్‌తో అమెరికా మార్కెట్‌ను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఇది దక్షిణ కొరియాతో పాటు ఇతర దేశాల వాణిజ్య సంబంధాలపై కూడా ప్రభావం చూపవచ్చు. దక్షిణ కొరియా, అమెరికా ఈ సమస్యను నిశితంగా పరిశీలిస్తున్నాయి. చైనా ఉత్పత్తులపై కఠిన తనిఖీలు, అలాగే అంతర్జాతీయ సమాజంతో కలిసి చైనాపై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ సంఘటన వాణిజ్య యుద్ధాలను మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉంది. దీని పర్యవసానాలు ఆసియా, పశ్చిమ దేశాల ఆర్థిక వ్యవస్థలపై పడవచ్చు.

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com