22 C
Hyderabad
Friday, November 6, 2026

Live Video

spot_img

అదరగొట్టిన అవేశ్‌ ఖాన్.. లక్నో సూపర్ విక్టరీ..

ఐపీఎల్‌లో మరో ఉత్కంఠభరిత మ్యాచ్‌ జరిగింది. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ సూపర్ విక్టరీ సాధించింది. ఆఖరి బాల్‌ వరకు నువ్వే నేనా అన్నట్టుగా సాగిన ఈ మ్యాచ్‌లో గెలుపు లక్నోనే వరించింది. దీనికి కారణం అవేశ్‌ ఖాన్ అద్భుత బౌలింగ్. ఆఖరి ఓవర్‌లో 9 పరుగులు కావాల్సి ఉండగా.. కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి ఒక వికెట్ తీసి కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

మొదట బ్యాటింగ్ చేసిన లక్నో.. 5 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. మార్‌క్రమ్‌ 6.. ఆయుషో బదోని 50, సమద్ 30 పరుగులు చేయడంతో భారీ స్కోర్‌ చేసిందనే చెప్పాలి. నిజానికి ఇది బీట్ చేయలేని స్కోర్ ఏం కాదు. రాజస్థాన్ మ్యాచ్‌ను కూడా అలానే ప్రారంభించింది. యశస్వి.. తొలి మ్యాచ్‌ ఆడిన వైభవ్ సూర్యవంశీ దూకుడుగా ఆడారు. 8 ఓవర్లకే వికెట్ కోల్పోకుండా 82 పరుగులు చేసింది రాజస్థౄన్. సూర్యవంశీ, వైభవ్, నితీశ్ నిష్క్రమించినా.. రియాన్ పరాగ్ పరుగుల వరదను కంటిన్యూ చేశాడు.

మ్యాచ్‌ను చూసిన వారెవ్వరూ కూడా రాజస్థాన్ ఓడిపోతుందని అస్సలు ఊహించి ఉండరు. ఈ మ్యచ్‌ను టర్న్‌ చేసింది 18వ ఓవర్ వేసిన అవేశ్‌ ఖాన్. ఈ ఓవర్‌లో కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి జైస్వాల్, పరాగ్‌లను ఔట్ చేశాడు. దీంతో రాజస్థాన్‌పై ప్రెజర్ పెరిగింది. ఇక 19వ ఓవర్‌లో 11 పరుగులు వచ్చాయి. దీంతో టార్గెట్ 9 పరుగులకు తగ్గింది. కానీ అవేశ్‌ ఖాన్‌ అద్భుత బౌలింగ్‌తో విజయం లక్నోదే అయ్యింది.

తన బౌలింగ్ వల్ల మ్యాచ్ గెలవడం సంతోషంగా ఉందన్నాడు అవేశ్‌ఖాన్. బౌలింగ్ వేసే సమయంలో తాను స్కోర్ బోర్డును చూడనని.. నా స్టైల్‌లో నేను బౌలింగ్ వేస్తానంటూ క్లారిటీ ఇచ్చాడు. ఇక ఆఖరి బాల్‌కు నాలుగు పరుగులు కావాల్సి వచ్చినప్పుడు యార్కర్‌ వేయాలనుకున్నా.. అది బాగా ఉపయోగపడిందన్నాడు అవేశ్‌ఖాన్.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com