27.2 C
Hyderabad
Friday, November 6, 2026

Live Video

spot_img

జర్మనీ అబ్బాయి – ఆంధ్ర అమ్మాయి వివాహం

ఏపీలో ఆసక్తికర వివాహం జరిగింది. ఆంధ్రా, జర్మనీ మధ్య వివాహ బంధం కుదిరింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వధువు, జర్మనీకి చెందిన వరుడు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ అరుదైన వివాహానికి పెదవడ్లపూడి వేదిక అయ్యింది.

ఆంధ్రప్రదేశ్‌కి చెందిన మౌనిక జర్మనీలో పీహెచ్డీ చేస్తూ అక్కడే ఉద్యోగం చేస్తోంది. అదే సమయంలో అక్కడే ఉద్యోగం చేస్తున్న ఫాబియన్ డువెన్ బేక్ అనే జర్మన్ యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడి, అది క్రమంగా ప్రేమగా మారింది. ఈ ప్రేమకు ఇరువురు తల్లిదండ్రులు అంగీకరించడంతో, వారు వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

పెదవడ్లపూడికి చెందిన సుదర్శనం రవికుమార్, లక్ష్మీ కొండల రాణి దంపతుల కుమార్తె మౌనిక. ఫాబియన్ డువెన్ బేక్‌తో పరిచయం ప్రేమగా మారి, పెద్దల ఆశీస్సులతో వీరి వివాహం ఆదివారం, పెదవడ్లపూడి భగవాన్ సత్య షిరిడి సాయిబాబా కళ్యాణ మండపంలో జరిగింది. బంధుమిత్రుల సాక్షిగా ఈ వివాహం ఎంతో వైభవంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి మాజీ సర్పంచ్, టీడీపీ శాశ్వత సభ్యులు అన్నే చంద్రశేఖర్, పద్మలత దంపతులు హాజరై నూతన వధూవరులను శాలువాలతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈ కొత్త జంట దాంపత్య జీవితం ఆనందంగా, సంతోషంగా సాగాలని ఆకాంక్షించారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com