సొంత గ్రౌండ్ అంటే ఏ ఫ్రాంచైజీకైనా అడ్వాంటేజ్ ఉంటుంది. ఆ గ్రౌండ్లో వారి రికార్డులు సరికొత్తగా ఉంటాయి. కానీ RCB సీన్ మాత్రం కంప్లీట్ రివర్స్. సొంత మైదానమంటే చాలు RCB ప్లేయర్లకు ఓటమి అలవాటుగా మారింది. ఎందుకంటే ఈ సీజన్లో RCB ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడింది. అందులో నాలుగింటిలో గెలిచింది. ఈ నాలుగు కూడా బయటి వేదికల్లో ఆడినవే. ఇక ఓడినవన్ని కూడా సొంత మైదానంలోనే. పంజాబ్‌తో ఓటమిని కలుపుకుంటే RCBకి హోంగ్రౌండ్లో ఇది హ్యాట్రిక్ ఓటమి. ఈ సీజన్లో సొంత గ్రౌండ్లో ఒక్క మ్యాచ్‌ను కూడా గెలవని ఏకైక టీమ్ RCB మాత్రమే.
ఇక ఐపీఎల్ మొత్తం సీజన్ పరంగా చూసుకుంటే ఇప్పటి వరకు ఈ రికార్డ్ ఢిల్లీ క్యాపిటల్స్ పేరుపై ఉండేది. ఈ టీమ్ ఇప్పటి వరకు హోంగ్రౌండ్లో 45 మ్యాచ్‌లు ఓడింది.ఇప్పుడీ రికార్డును బ్రేక్ చేసింది RCB. ఏకంగా 46 మ్యాచ్‌లు ఓడింది బెంగళూరు.
ఇక టీమ్ డేవిడ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలి. వంద పరుగుల కన్నా తక్కువ స్కోర్ నమోదైన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు టిమ్ డేవిడ్. అతని పుణ్యమా అనే RCB మరో సరికొత్త చెత్త రికార్డును తప్పించుకుందని చెప్పాలి.