మరోసారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తడబడింది. సొంత గడ్డపై పంజాబ్ కింగ్స్‌తో ఆడిన మ్యాచ్‌లో ఓడింది. వరణుడు పెట్టిన టెన్షన్.. ఆ తర్వాత మారిన పిచ్ పరిస్థితి.. బెంగళూరుకు శాపంగా మారాయి. వర్షం కారణంగా మ్యాచ్‌ను 14 ఓవర్లకు కుదించగా.. కేవలం 95 పరుగులు మాత్రమే చేసింది బెంగళూరు. అది కూడా ఏకంగా 9 వికెట్లు కోల్పోయి. ఇక ఈ టార్గెట్‌ను 12.1 ఓవర్లలో చేజ్ చేసింది. ఏకంగా 5 వికెట్ల తేడాతో గెలిచి.. పాయింట్ల పట్టికలో సెకండ్ ప్లేస్‌కు వెళ్లిపోయింది.
బెంగళూరు బ్యాటింగ్ చూస్తే పాత రికార్డులను చెరిపేసి సరికొత్త అత్యల్ప స్కోర్ క్రియేట్ చేస్తారా అని వణికిపోని RCB ఫ్యాన్ ఉండడు. ఒకటి, రెండులు తప్ప.. పెద్దగా బ్యాటర్లు చేసిన స్కోర్ లేదనే చెప్పాలి. మ్యాచ్ ప్రారంభంలో పిచ్ మొత్తం బ్యాటర్లకు అనుకూలంగా మారింది. దీనికి తోడు గ్రౌండ్ కూడా పూర్తిగా ఆరకపోవడం కూడా బెంగళూరుకు కలిసి రాలేదు.
RCB ఆ మాత్రం గౌరవప్రదమైన స్కోర్ చేసిందంటే దానికి కారణం టిమ్ డేవిడ్. 26 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి RCB స్కోర్‌ను 95 పరుగుల వరకు తీసుకెళ్లాడు. ఇక కెప్టెన్ రజత్ పటీదార్ చేసిన 23 పరుగులు కలిసి వచ్చాయి. వీరిద్దరు తప్ప.. టీమ్‌లో ఏ ఒక్క ప్లేయర్ కూడా సింగిల్ డిజిల్ దాటలేదు.
ఇక 96 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన పంజాబ్ ఈజీగానే స్కోర్ చేసిందనే చెప్పాలి. కానీ RCB బౌలర్లు గట్టిగానే మ్యాచ్‌పై పట్టు సాధించేందుకు ప్రయత్నించారు. కానీ అది కుదరలేదు. నేహాల్ వధేరా 33 పరుగులతో టాప్ స్కోరర్ నిలిచాడు. హేజెల్ వుడ్ ఏకంగా మూడు వికెట్లు తీశాడు. కానీ అంతిమంగా గెలుపు మాత్రం పంజాబ్‌దే అయ్యింది.