27.2 C
Hyderabad
Friday, November 6, 2026

Live Video

spot_img

మే 1 నుంచి 15 గ్రామీణ బ్యాంకుల విలీనం

  • 11 రాష్ట్రాల్లో బ్యాంకుల విలీనం ప్రభావం

దేశవ్యాప్తంగా గ్రామీణ బ్యాంకింగ్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ యేడాది మే 1 నుంచి 11 రాష్ట్రాల్లో ఉన్న 15 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను విలీనం చేయనుంది. ఈ విలీనం ద్వారా ఒక రాష్ట్రం – ఒక గ్రామీణ బ్యాంకు లక్ష్యాన్ని సాధించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అడుగులు వేస్తోంది.

ఈ విలీనం ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ఏకీకరణలో నాలుగో దశ. విలీనాల తర్వాత దేశవ్యాప్తంగా గ్రామీణ బ్యాంకుల సంఖ్య 43 నుండి 28కి తగ్గనుంది.

విలీనం ప్రభావం ఉండే రాష్ట్రాలు :

ఆంధ్రప్రదేశ్ :

చైతన్య గోదావరి, ఆంధ్ర ప్రగతి, సప్తగిరి, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులు విలీనం అయి ఒకే బ్యాంకుగా ‘ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు’గా ఏర్పడనుంది.

ఉత్తరప్రదేశ్ :

బరోడా యుపి, ఆర్యవర్థ, ప్రథమ యుపి గ్రామీణ బ్యాంకులు కలిసి ‘ఉత్తరప్రదేశ్ గ్రామీణ బ్యాంకు’గా ఏర్పాటు కానుంది. ఈ బ్యాంకు ప్రధాన కార్యాలయం లక్నోలో ఉంటుంది.

పశ్చిమ బెంగాల్ :

బంగీయ గ్రామీణ వికాస్, పశ్చిమ బెంగాల్ గ్రామీణ, ఉత్తర్ బాంగ్ గ్రామీణ బ్యాంకులు కలిపి ‘పశ్చిమ బెంగాల్ గ్రామీణ బ్యాంకు’గా ఏర్పాటు కానుంది.

ఇవి కాకుండా బీహార్, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాల్లోనూ గ్రామీణ బ్యాంకులను విలీనం చేయనున్నారు. ఈ బ్యాంకులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ వంటి ప్రభుత్వ బ్యాంకుల అనుబంధ సంస్థలుగా కొనసాగతాయి.

గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవల విస్తరణకు ఇది పెద్ద ఊతం అవుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com