24.9 C
Hyderabad
Saturday, June 27, 2026

Live Video

spot_img

జపాన్‌లో వారం రోజులు రేవంత్‌రెడ్డి పర్యటన

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనకు వెళ్లారు. నిన్న రాత్రి బెంగళూరు ఎయిర్‌పోర్టు నుంచి ఆయన బయలుదేరి వెళ్లారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ ఉన్నతాధికారుల బృందం కూడా సీఎం జపాన్‌ పర్యటనలో ఆయన వెంట పాల్గొంటున్నారు.

ఈ పర్యటనలో, ముఖ్యమంత్రి బృందం టోక్యో, మౌంట్ ఫుజి, ఓసాకా, హిరోషిమా నగరాలను సందర్శించనుంది. ఇవాల్టి నుంచి ఈనెల 22వ తేదీ వరకు జరగనున్న ఈ పర్యటనలో వివిధ కంపెనీల ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలతో సీఎం రేవంత్‌ భేటీ అవుతారు. పారిశ్రామిక పెట్టుబడులు, సాంకేతిక సహకారం, ఏఐ ఆధారిత అభివృద్ధిపై చర్చలు జరగనున్నాయి. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని జపాన్‌ ప్రభుత్వంతో పాటు.. అక్కడి కంపెనీలను సీఎం రేవంత్‌ కోరనున్నారు.

రేవంత్‌ టీమ్‌ పర్యటన షెడ్యూల్ :

ఏప్రిల్ 16 : నారిటా ఎయిర్‌పోర్ట్ ద్వారా జపాన్ చేరుకుంటారు. భారత రాయబారితో ఆతిథ్య సమావేశం జరుగుతుంది.
ఏప్రిల్ 17 : టోక్యోలో సోనీ గ్రూప్, జైకా, JETRO, జపాన్ బయో ఇండస్ట్రీ అసోసియేషన్‌తో సమావేశాలు. సాయంత్రం తోషిబా ఫ్యాక్టరీ సందర్శన.
ఏప్రిల్ 18 : గాంధీ విగ్రహానికి పుష్పాంజలి, టోక్యో గవర్నర్‌తో మర్యాదపూర్వక భేటీ. పారిశ్రామిక వేత్తలతో సమావేశాలు. టయోటా, తోషిబా, ఐసిన్, ఎన్టీటీ సంస్థల సీఈవోలతో చర్చలు. సుమిదా రివర్ ఫ్రంట్ సందర్శన.
ఏప్రిల్ 19 : మౌంట్ ఫుజి, అరకురయామా పార్క్ సందర్శన.
ఏప్రిల్ 20 : కిటాక్యూషు నగరంలో మేయర్‌తో భేటీ. ఎకో టౌన్ ప్రాజెక్ట్, మ్యూజియంలు సందర్శన.
ఏప్రిల్ 21 : ఓసాకాలో వరల్డ్ ఎక్స్‌పో 2025లో తెలంగాణ పెవిలియన్ ప్రారంభం. బిజినెస్ రౌండ్‌టేబుల్ సమావేశం, ఓసాకా రివర్ ఫ్రంట్ సందర్శన.
ఏప్రిల్ 22 : హిరోషిమాలో పీస్ మెమోరియల్ సందర్శన, గాంధీ విగ్రహానికి పుష్పాంజలి. స్థానిక అధికారులతో భేటీలు. మజ్డా మోటార్స్ ఫ్యాక్టరీ, టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ సందర్శన.
ఏప్రిల్ 23 : రేవంత్‌ బృందం ఓసాకా నుంచి బయలుదేరి హైదరాబాద్‌కు చేరుకుంటుంది.
Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com