27.4 C
Hyderabad
Wednesday, June 24, 2026

Live Video

spot_img

దేవ్‌దత్‌ను దేఖలేదు.. వార్నర్‌ను పట్టించుకోలేదు

ఐపీఎల్ అనగానే టక్కున్న గుర్తొచ్చే ప్లేయర్స్‌లో ఒకరు డేవిడ్ వార్నర్. ఈ ఆసీస్ దిగ్గజానికి ఇండియాలో కూడా చాలా ఫ్యాన్ బేస్ ఉంది. ఎస్పెషల్లీ హైదరాబాద్, ఢిల్లీలో. కేవలం తన ఆటతోనే కాదు.. తన మ్యానరిజమ్, రీల్స్, డైలాగ్స్‌, డాన్స్‌తో కూడా ఫ్యాన్స్‌కు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తాడు వార్నర్. అలాంటి వార్నర్ ఈసారి మెగా వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. ఓ వైపు ప్లేయర్స్‌కు కోట్లు కుమ్మరించిన ఐపీఎల్ ఫ్రాంచైజీలు వార్నర్‌వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. ఐపీఎల్ 2025 కోసం ఆదివారం సౌదీ అరేబియా రాజధాని జెడ్డాలో జరిగిన తొలి రోజు వేలంలో వార్నర్‌కు తీవ్ర అవమానమే జరిగింది. వార్నర్‌ ఐపీఎల్‌లో మూడుసార్లు ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. 2016లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా ఐపీఎల్ టైటిల్ తెచ్చి పెట్టాడు. ఐపీఎల్‌ బుల్ గా చెప్పుకునే వార్నర్ 6,565 పరుగులు చేశాడు. కానీ ఇవేవీ పట్టించుకోలేదు ఫ్రాంచైజీలు.

వార్నర్‌తో పాటు మరో ఇండియన్‌ ప్లేయర్‌ను కూడా అస్సలు పట్టించుకోలేదు ఐపీఎల్ టీమ్స్. టీం ఇండియా ప్లేయర్ దేవ్ దత్ పడిక్కల్ కోసం ఏ ఫ్రాంఛైజీ బిడ్ దాఖలు చేయలేదు. లెఫ్ట్ హ్యాండ్ టాప్ ఆర్డర్ బ్యాటర్ అయిన పడిక్కల్.. ప్రస్తుతం టీం ఇండియాకు ప్రాతినిధ్యం వహించట్లేదు. కానీ.. దేశవాళీ క్రికెట్ లో కర్ణాటకకు ఆడుతున్నాడు. గత సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్, 2023లో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీలకు ఆడాడు. 200లకు పైగా పరుగులు చేసిన అతడికి 2020, 2021 బెస్ట్ సీజన్లుగా నిలిచాయి. పంత్, శ్రేయాస్ అయ్యర్ మాదిరిగా స్టార్ ప్లేయర్ అయినా దేవ్ దత్ పడిక్కల్‌ను మాత్రం పట్టించుకోలేదు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com