ఐపీఎల్ మెగా వేలంలో రూ.18 కోట్లు దక్కించుకున్నాడు చాహల్. చాహల్‌కు డిమాండ్ ఉంటుందని తెలుసు… కానీ మరి ఇంత డిమాండ్ ఉంటుందని చాహల్ కూడా ఊహించి ఉండడు. మొన్నటి వరకు రాజస్థాన్ రాయల్స్‌కు ఆడిన ఈ మణికట్టు మాంత్రికుడు.. ఇప్పుడు పంజాబ్‌కు తన సేవలందించబోతున్నాడు. చాహల్ కోసం చెన్నై, హైదరాబాద్, లక్నో చివరి వరకు పోటీ పడ్డాయి. కానీ పంజాబ్ పట్టు వదలకుండా బిడ్ చేసి చాహల్‌ను దక్కించుకుంది. గతంలో జరిగిన వేలంలో కేవలం రూ.6.5 కోట్లతో చాహల్‌ను దక్కించుకుంది రాజస్థాన్. రెండేళ్లలో అతని విలువ మూడు రెట్లు పెరిగిందని చెప్పాలి.
”మెగా వేలం జరుగుతున్నప్పుడు నేను కాస్త భయపడ్డా. ఎవరు తీసుకుంటారు? ఎంత వస్తుందనే విషయాలపై ఆలోచించా. కానీ ఇంత ధర నాపై పెట్టడం చూసి కాస్త టెన్షన్ అయ్యా. ఎందుకంటే గత మూడేళ్లలో నాకు దక్కిన మొత్తం ఇప్పుడు ఒకే ఏడాదిలో రానుంది. కానీ నేను దానికి అర్హుడినే అనుకుంటున్నా. మెగా వేలం సందర్భంగా నన్ను పంజాబ్ కింగ్స్ తీసుకుంటుందని మా ఫ్రెండ్స్ కొందరు చెప్పారు. రూ.12కోట్ల నుంచి 13 కోట్ల వరకు వస్తాయని అనుకున్నా. కానీ ఇంత మొత్తం రావడం ఇప్పుడు నాపై బాధ్యతను మరింత పెంచింది” వేలం ముగిసిన తర్వాత చాహల్ రియాక్షన్ ఇది.