30.7 C
Hyderabad
Friday, November 6, 2026

Live Video

spot_img

ఇంటర్మీడియట్‌ అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల

  • క్లాసులు జూన్‌ 2 నుంచి ప్రారంభం

తెలంగాణలో 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి జూనియర్‌ కాలేజీల అకడ‌మిక్ క్యాలెండ‌ర్‌ను ఇంటర్మీడియట్‌ బోర్డు విడుదల చేసింది. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి పనిదినాలు, తరగతులు, సెలవులు, పరీక్షల షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య కొత్త అకడ‌మిక్ క్యాలెండ‌ర్‌ను విడుదల చేశారు.

కొత్త అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం.. 2025-26 విద్యాసంవ‌త్సరం మొత్తం 226 పనిదినాలుగా ఇంట‌ర్ బోర్డు నిర్ణయించింది. వేసవి సెలవుల తర్వాత జూన్ 2వ తేదీ నుంచి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభం అవుతాయి. 2026 మార్చి 31వ తేదీని విద్యాసంవత్సరం చివరి పనిదినంగా నిర్ణయించారు.

ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ఈ ఏడాది సెప్టెంబర్‌ 28 నుంచి అక్టోబర్‌ 5వ తేదీ వరకు దసరా సెలువులు ఇవ్వనున్నారు. దసరా సెలవుల తర్వాత అక్టోబర్ 6వ తేదీన కాలేజీలు తిరిగి ప్రారంభమవుతాయి. అదేవిధంగా.. వచ్చే ఏడాది అంటే.. 2026 జనవరి 11 నుంచి 18వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు.

మార్చి మొదటి వారంలో ఇంటర్ పరీక్షలు :

  • జనవరి 19 నుంచి 24వ తేదీ వరకు ప్రీ ఫైనల్ పరీక్షలు, ఫిబ్రవరి మొదటి వారంలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు అడకమిక్ క్యాలెండర్‌లో పేర్కొన్నారు. మార్చి మొదటి వారంలో ఇంటర్ వార్షిక పరీక్షలు నిర్వహించనున్నట్లు క్యాలెండర్‌లో పేర్కొన్నారు. ఇక 2026 మే చివరి వారంలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది.
  • విద్యార్థులకు నవంబర్ 10 నుంచి 15వ తేదీ వరకు హాఫ్ ఇయర్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది.

ఇక, వచ్చే యేడాది వేసవి సెలవులను కూడా ఇంటర్‌బోర్డు ఇప్పుడే ఖరారు చేసింది. విద్యాసంవత్సరంలో వేసవి సెలవులు 2026 ఏప్రిల్ 1 నుంచి మే 31వ తేదీ వరకు ఇవ్వనున్నట్లు క్యాలెండర్‌లో ఇంటర్ బోర్డు స్పష్టంచేసింది. వచ్చే ఏడాది జూన్ 1వ తేదీన మరుసటి సంవత్సరానికి జూనియర్ కాలేజీలు పునః ప్రారంభమవుతాయని ఇంటర్ బోర్డు ప్రకటించింది.

ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ ఇలా…

ఇంటర్మీడియేట్ తరగతులు ప్రారంభం: 02.06.2025.
దసరా సెలవులు: 28.09.2025 – 05.10.2025.
అర్థ సంవత్సరం పరీక్షలు: 10.11.2025 – 15.11.2025.
సంక్రాంతి సెలవులు: 11.01.2026 – 18.01.2026.
ప్రీ ఫైనల్ పరీక్షలు: 19.01.2026 – 24.01.2026.
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు: 2026, ఫిబ్రవరి మొదటి వారంలో.
ఇంటర్ వార్షిక పరీక్షలు: 2026 మార్చి మొదటి వారంలో
విద్యాసంవత్సరం చివరి పనిదినం: 31.03.2026.
వేసవి సెలవులు: 01.04.2026 – 31.05.2026.
అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు: 2026, మే చివరి వారంలో.
జూనియర్ కాలేజీల పునః ప్రారంభం: 01.06.2026.
Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com