తమన్నా భాటియా, విజయ్ వర్మ రెండేళ్లు డేటింగ్ చేశారు. ఎక్కడైనా జంటగా కనిపించారు. కానీ కొన్ని నెలలుగా విడివిడిగా కనిపిస్తున్నారు. డేటింగ్ వార్తలపై స్పందించడం లేదు. దీంతో వీరిద్దరి మధ్య బంధం తెగిపోయిందని దాదాపుగా అర్థమైపోయింది. ఇప్పుడు వీడివిడిగా తమ మధ్య ఎలాంటి బంధం లేదని పరోక్షంగా తేల్చేసింది ఈ జంట.
లస్ట్ స్టోరిస్ 2లో కలిసిన ఈ జంట.. ఇప్పుడు పాట్నర్ ఎలా ఉండాలో.. ఎలా ఉండకూడదో ప్రపంచానికి చెబుతున్నారు. విజయ్ వర్మ లెటెస్ట్‌గా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రిలేషన్‌లో ఉన్నప్పుడు ఆ సమయాన్ని ఐస్‌క్రిమ్ తిన్నట్లుగా ఆస్వాదించాలి. సంతోషాన్ని మాత్రమే కాదు బాధ, కోపం, చిరాకును కూడా భరించాలి. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోకలగాలి. అప్పుడు బంధం బాగుంటుంది అంటున్నాడు విజయ్. సో.. విజయ్‌కు సంబంధించిన చిరాకు, బాధను తమన్నా పట్టించుకోకపోవడమో.. భరించకపోవడమో జరిగి ఉంటుందని తెలుస్తోంది.
ఇక తమన్నా కూడా ప్రేమ గురించి ఓ సభలో లెక్చర్ ఇచ్చింది. నేను నిస్వార్థమైన ప్రేమను నమ్ముతాను. ప్రేమ వ్యాపారంగా మారితే సమస్యలు మొదలవుతాయి. రిలేషన్‌లో ఉన్నప్పటి కంటే లేనప్పుడే బాగున్నాను.. పాట్నర్ ఎంపికలో అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి అంటోంది ఈ మిల్కీ బ్యూటి. అంటే విజయ్ తన ప్రేమను ఎక్కడ వ్యాపారంగా మలిచాడో మరి.
మొత్తానికి రెండు విభిన్న కారణాలతో ఈ జంట విడిపోయినట్టు క్లారిటీ వచ్చింది. మరి ఈ బంధం మళ్లీ పట్టాలెక్కుతుందా? లేక ఈ సారి మంచి పాట్నర్స్‌ను చూసుకొని సెటిలైపోతారా? అనేది చూడాలి.