37.2 C
Hyderabad
Saturday, April 25, 2026

Live Video

spot_img

రాశిఫలాలు…30.03.25 నుండి 05.04.25 వరకు

పండగలు… పర్వదినాలు…

  • 30, ఆదివారం, ఉగాది
  • 01, మంగళవారం, సౌభాగ్య గౌరీ వ్రతం
  • 02, బుధవారం, శ్రీ పంచమి

మేషం… (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

అనుకున్న కార్యక్రమాలలో అవాంతరాలు అధిగమిస్తారు. జీవిత లక్ష్యాలను సాధించడంలో ముందడుగు వేస్తారు. చిరకాల కోరిక నెరవేరడం విశేషం. కొన్ని వ్యవహారాలలో పట్టింది బంగారంగా ఉంటుంది. ఎంతటి వారినైనా మీ వాగ్దాటి ఆకట్టుకుంటుంది. సమాజంలో పరపతి పెరుగుతుంది. అనుకున్న మేరకు డబ్బు సమకూరడంతో అవసరాలు తీరతాయి. రుణబాధలు తొలగుతాయి. కుటుంబంలో వివాదాలను సహనంతో పరిష్కరించుకుంటారు. సంతానరీత్యా శుభవార్తలు ఊరటనిస్తాయి. పెద్దల సలహాల మేరకు నిర్ణయాలు తీసుకుంటారు.కొన్ని రుగ్మతల నుంచి బయటపడతారు. వ్యాపారాలు మరింత ఉత్సాహవంతంగా కొనసాగుతాయి.ఉద్యోగాలలో ఊహించని ప్రగతి కనిపిస్తుంది. నాయకులు, కళాకారుల ప్రయత్నాలు క్రమేపీ ఫలిస్తాయి. 31,01 తేదీలలో ముఖ్య ఒప్పందాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. స్వల్ప శారీరక రుగ్మతలు. శివాష్టకం పఠించండి.

వృషభం… (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, వృగశిర 1,2 పాదాలు)

మీ కృషి ఫలించి వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఇతరుల సాయం లేకున్నా ధైర్యంగా ముందుకు సాగుతారు. ఇంటి నిర్మాణయత్నాలు కాస్త వేగవంతం కాగలవు. కుటుంబసభ్యులతో సత్సంబంధాలు నెలకొంటాయి. సలహాలు స్వీకరిస్తారు. ఆదాయం కొంత తగ్గినా మీ అవసరాలు తీరే సూచనలు. ఆరోగ్యం గతం కంటే మరింత మెరుగుపడి ఊరట చెందుతారు. వ్యాపారాలు కొంత మందగించినా క్రమేపీ అనుకూలిస్తాయి.  ఉద్యోగులకు ఎనలేని గౌరవం లభిస్తుంది. రాజకీయ నాయకులు, కళాకారులు సరైన గుర్తింపు లభిస్తుంది. నాయకులకు పదవులు దక్కుతాయి. 01,02 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు.ఎంత శ్రమపడ్డా ఫలితం కనిపించదు.కొన్ని నిర్ణయాలు వాయిదా. దుర్గామాతకు కుంకుమార్చన చేయండి.

మిథునం… (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)

ప్రతిబంధకాలు అధిగమించి ముందుకు సాగి కార్యక్రమాలు పూర్తి చేస్తారు. మిత్రులతో సంతోషంగా ముందుకు సాగుతారు. సమాజంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి.వాహనాలు,ఆభరణాలు కొనుగోలు చేసే వీలుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. చిరకాల ప్రత్యర్థులు మీకు కొంత సహాయపడే వీలుంది. ఓర్పు, నేర్పు మీకు ఎంతగానో సహయాపడతాయి. అనుకున్న ఆదాయానికి ఢోకా ఉండదు, రుణబాధలు తొలగుతాయి. స్థిరాస్తులపై పెట్టుబడులు రెట్టింపు చేస్తారు. బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. సంపూర్ణ ఆరోగ్యం చేకూరి ఉత్సాహంతో గడుపుతారు. వ్యాపారాలలో ప్రగతి కనిపిస్తుంది. కొత్త భాగస్వాముల చేయూతతో ముందుకు సాగుతారు. కళాకారులను విజయాలు వరిస్తాయి. వైద్యులకు విశేష గౌరవం లభిస్తుంది. 02,03 తేదీలో వివాదాలు. మానసిక అశాంతి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. దూరప్రయాణాలు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కర్కాటకం… (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)

ఆలోచనలు అమలులో విజయం సాధిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. సేవాకార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. అనుకున్న సొమ్ము సకాలంలో అందుతుంది. దీర్ఘకాలిక రుణబాధల నుంచి విముక్తి. భూములు, బంగారం వంటి వాటిపై పెట్టుబడులు పెడతారు.బంధువులతో సత్సంబంధాలు నెలకొని ఉత్సాహంగా గడుపుతారు. సంతానం నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. వ్యాపారులు లాభాల బాటలో నడుస్తారు. భాగస్వాముల సలహాల మేరకు పెట్టుబడులు పెడతారు. విస్తరణలో ముందడుగు వేస్తారు.ఉద్యోగాలలో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. అయితే విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. రాజకీయవేత్తలు, పరిశోధకులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. 04,05 తేదీల్లో మనశ్శాంతి లోపం. ధనవ్యయం. మిత్రులతో కలహాలు. రాఘవేంద్ర స్తోత్రాలు పఠించండి.

సింహం… (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)

కొన్ని ఈతిబాధలు, సమస్యలు తీరే సమయం. విచిత్రమైన సంఘటనలు ఆకట్టుకుంటాయి. పలుకుబడి పెరిగి సమాజంలో ప్రత్యేక గౌరవం పొందుతారు. ఇతరులకు సైతం సహాయం చేసేందుకు సిద్ధపడతారు. ధార్మిక కార్యక్రమాల నిర్వహణలో నిమగ్నమవుతారు. మీలో ఉన్న నైపుణ్యతను అందరూ గుర్తిస్తారు. చీటికీమాటికీ ఎదురయ్యే చికాకులు తొలగుతాయి. ప్రత్యర్థులను మీవైపునకు తిప్పుకుంటారు. రావలసిన సొమ్ము అందుతుంది. ఇబ్బందులు తీరి ఊరట చెందుతారు. ఆస్తులు సమకూర్చుకునేందుకు కొంత వెచ్చిస్తారు. బంధువుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. శుభకార్యాలపై ప్రణాళిక రూపొందిస్తారు. స్వల్ప రుగ్మతలు ఎదురైనా అధిగమిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు సంభవం. పనిభారం తగ్గుతుంది. నాయకులు, చిత్రకారులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలు అనుకున్న అనుమతులు సాధిస్తారు.01,02 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. ఒప్పందాలు వాయిదా. శివాలయ దర్శనం చేయండి.

కన్య… (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)

ఎంతటి సమస్య ఎదురైనా ఆత్మవిశ్వాసంతో పరిష్కరించుకుంటారు. ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులతో పరిచయాలు. భూములు, వాహనాలు సమకూర్చుకుంటారు. కొన్ని విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆలయాలు, మఠాలు సందర్శిస్తారు.అనుకున్న కార్యక్రమాలు సజావుగా సాగి ఊరట చెందుతారు. వాహనాలు, భూములు, కొనుగోలు చేస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడి రుణాలు తీరుస్తారు. స్థిరాస్తులు, బంగారం వంటి వాటిపై పెట్టుబడులు పెడతారు. కొన్ని సంస్థల్లో మీ భాగస్వామ్యాన్ని పెంచుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు జరుపుతారు. సోదరుల నుండి సహాయం అందుతుంది. ఆరోగ్యం గతం కంటే మెరుగుపడుతుంది. వ్యాపారాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. భాగస్వాములతో వివాదాలు తీరతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. కళాకారులు, వైద్యులకు మరింతగా పేరుప్రఖ్యాతలు లభిస్తాయి. 02,03 తేదీలలో మిత్రులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఖర్చులు పెరుగుతాయి. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

తుల… (చిత్త 3,4పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)

ఇంతకాలం మీపట్ల విముఖంగా ఉన్న వారే ప్రశంసలు కురిపిస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కారమై కొంత లబ్ది చేకూరుతుంది. అనుకున్న కార్యక్రమాలను పూర్తి చేసి సత్తా చాటుకుంటారు.నిరుద్యోగుల కలలు ఫలించి ఉద్యోగాలు పొందుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని వివాదాలు నెలకొన్నా సర్దుబాటు చేసుకుంటారు. ఒక వ్యక్తి ద్వారా అందిన సమాచారం మీలో ఉత్సాహాన్నిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగి ఊరట చెందుతారు. అప్రయత్నంగా కొంత సొమ్ము అందే అవకాశం. బాకీలు పడిన వారు సైతం సకాలంలో చెల్లింపులు జరుపుతారు. వివాహయత్నాలు ముమ్మరం చేస్తారు. సోదరులు, బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు.కొన్ని  ఆరోగ్య సమస్యల నుంచి బయటపడి ఊరట చెందుతారు. వ్యాపారాలు మరింత అనుకూలించి లాభాలు అందుకుంటారు. భాగస్వాముల నుంచి ఊహించని రీతిలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగినా సమర్థతను చాటుకుంటారు. నాయకులు, కళాకారులకు సమస్యలు తీరి లాభం పొందుతారు. 03,04 తేదీల్లో బంధువుల నుండి ఒత్తిడులు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. మిత్రులతో కలహాలు. ఆంజనేయ దండకం పఠించండి.

వృశ్చికం… (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

కొత్త వ్యక్తులు పరిచయమై మీకు తోడ్పాటునందిస్తారు. ఇంతకాలం చేసిన కృషి ఫలించే సమయం. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఒక ప్రముఖ వ్యక్తి ద్వారా ఊహించని విధంగా పిలుపు రావచ్చు. రావలసిన సొమ్ము అందుతుంది. దీర్ఘకాలిక రుణబాధల నుంచి విముక్తి లభిస్తుంది. స్థిరాస్తులు కొనుగోలుకు కొంత వెచ్చిస్తారు. కుటుంబసభ్యుల ఆదరణ లభిస్తుంది. వివాహాది శుభకార్యాల నిర్వహణలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. సోదరులతో సఖ్యత నెలకొంటుంది. ఆరోగ్యం ఊరటనిస్తుంది. వ్యాపారాలు గతం కంటే మెరుగుపడతాయి. ఉద్యోగులకు స్థితి పెరుగుతుంది. విధుల్లో ఆటంకాలు అధిగమిస్తారు. నాయకులు, పారిశ్రామికవేత్తలకు అంచనాలు ఫలిస్తాయి. 04,05 తేదీల్లో అనుకోని ఖర్చులు. కుటుంబంలో సమస్యలు. దూరప్రయాణాలు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

ధనుస్సు… (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)

వ్యవహారాలలో విజయం చేకూరుతుంది. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. చిరకాల మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ప్రముఖులతో పరిచయాలు నూతనోత్సాహాన్నిస్తాయి. కాంట్రాక్టులు లభించి లబ్ధి పొందుతారు. వాహనాలు, ఇళ్లు కొనుగోలు చేస్తారు. దేవాలయాలు సందర్శిస్తారు. సొమ్ముకు లోటు రాదు. రుణబాధలు తొలగుతాయి. ఆస్తుల విక్రయాలు జరిపి ఊహించని రీతిలో డబ్బు లభిస్తుంది. సంతాన విషయంలో చికాకులు తొలగుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లభిస్తుంది. మీ ప్రేమాభిమానాలతో బంధువులు ప్రశంసలు కురిపిస్తారు. వ్యాపారాలు క్రమేపీ వృద్ధి చెందుతాయి. కొత్త పెట్టుబడులు అందుతాయి. విస్తరణ కార్యక్రమాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగాలలో ఇంతకాలం ఎదుర్కొన్న కష్టాలు తొలగుతాయి. ఉన్నతాధికారులు మీ సేవలను గుర్తిస్తారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అనుకున్న అవకాశాలు దగ్గరవుతాయి. 30,31 తేదీలలో ఆకస్మిక ప్రయాణాలు. వివాదాలకు దూరంగా ఉండండి. కీలక నిర్ణయాలలో మార్పులు. కుజగ్రహస్తోత్రాలు పఠించండి.

మకరం… (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు)

అప్రయత్నంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు తీరతాయి. ఆహ్వానాలు ఉత్సాహాన్నిస్తాయి. విద్యార్థుల ప్రతిభకు గుర్తింపు లబిస్తుంది. పరిచయాలు మరింత పెరుగుతాయి. సహనంతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆస్తుల వివాదాలు నుంచి గట్టెక్కుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఊహించని రీతిలో సొమ్ము సమకూరుతుంది. పెండింగ్‌లో ఉన్న బాకీలు సైతం అందుకుంటారు. స్థిరాస్తుల కొనుగోలుకు డబ్బు వెచ్చిస్తారు. మీ ప్రయత్నాలకు కుటుంబసభ్యులు పూర్తిగా సహకరిస్తారు. పెద్దల ఆరోగ్యంపై ఊరట చెందుతారు. పూర్తి స్వస్థత చేకూరి ఊరట లభిస్తుంది. వైద్యసేవలకు స్వస్తి చెబుతారు. వ్యాపారాలలో అనుకున్న సమయానికి విస్తరణ కార్యక్రమాలు పూర్తి చేస్తారు. పెట్టుబడులు మరింత పెంచుతారు. ఉద్యోగాలలో విధుల్లో మీదే పైచేయిగా ఉంటుంది. ఒడిదుడుకులు తొలగుతాయి.పారిశ్రామికవేత్తలు, కళాకారులకు శుభవార్తలు అందుతాయి. 02,03 తేదీల్లో కుటుంబంలో ఒత్తిడులు, సమస్యలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. విష్ణుధ్యానం చేయండి.

కుంభం… (ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)

మీరు పడిన శ్రమ వృథాగా మారే అవకాశం. ఆత్మీయులతో కొన్ని విషయాలపై చర్చిస్తారు. క్లిష్టమైన సమస్యలు ఎదురై చికాకు పరుస్తాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సమాజసేవలో పాలుపంచుకుంటారు. వాహనాలు, స్థలాలు కొనుగోలులో ఆటంకాలు. విద్యార్థులకు కొద్దిపాటి చికాకులు. ప్రతి వ్యవహారంలోనూ ఆచితూచి ముందుకు సాగడం ఉత్తమం. రావలసిన సొమ్ము అందక అప్పులు చేస్తారు. ఆస్తుల విక్రయాలలో ప్రతిష్ఠంభన వల్ల డబ్బు ఆలస్యమవుతుంది. కొత్త పెట్టుబడులు సైతం నిలిపివేస్తారు. కుటుంబసభ్యులతో అకారణంగా వైరం. మీమాటకు వ్యతిరేకత పెరుగుతుంది. ఆరోగ్యపరంగా చికాకులు, తరచూ ఆస్పత్రుల సందర్శనం. 30,31తేదీల్లో ధనలబ్ధి. వివాదాలు తీరతాయి. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. దేవీస్తుతి మంచిది.

మీనం… (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరభాద్ర, రేవతి)

కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. సమాజసేవలో పాల్గొంటారు. కొన్ని కష్టాల నుంచి గట్టెక్కుతారు. ఒక సమాచారం ఊరటనిస్తుంది. చిన్ననాటి విషయాలు కొన్ని గుర్తుకు వస్తాయి. యుక్తితో కొన్ని సమస్యలు పరిష్కరించుకుని అందర్నీ ఆకట్టుకుంటారు. ఇంటి నిర్మాణాలపై ప్రత్యేక దష్టి పెడతారు. అనుకున్న సమయానికి సొమ్ము సమకూరుతుంది. అప్పుల బాధలు తొలగుతాయి. స్థిరాస్తుల కొనుగోలుకు కొంత డబ్బు వెచ్చిస్తారు. షేర్ల విక్రయాలు జరిపి కొంత ధనం దక్కుతుంది. పెద్దల సూచనల మేరకు నిర్ణయాలు తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరుస్తాయి. వివాహాది శుభకార్యాల నిర్వహణపై సోదరుల సలహాలు స్వీకరిస్తారు.  ఆరోగ్యం మెరుగుపడి ఊరట చెందుతారు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. పెట్టుబడులు సమీకరిస్తారు. భాగస్వాముల నుంచి సహాయసహకారాలు అందుతాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గి ఊరట చెందుతారు. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అనుకోని ఆహ్వానాలు అందుతాయి. 03,04 తేదీల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. మనశ్శాంతి లోపం. కావలసిన వారితో విభేదాలు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com