ఝార్ఖండ్‌లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు తారుమారు అవుతున్నాయి. మరోసారి కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చేలా ఉంది. జార్ఖండ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 41. ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య పోరు హోరా హోరీగా సాగినా చివరకు ఇండియా కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు చేరువైంది.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు అయ్యే అవకాశం ఉందని జార్ఖండ్ ముక్తి మోర్చా జనరల్ సెక్రటరీ, అధికార ప్రతినిధి సుప్రీయో భట్టాచార్య పేర్కొన్నారు. మళ్లీ తామే అధికారంలోకి వస్తామని, ఎన్డీఏ కూటమికి ప్రజలు వ్యతిరేక తీర్పు ఇస్తారని ఆయన స్పష్టం చేశారు. సీఎం హేమంత్ సోరెన్ కూడా తమ పార్టీ గెలుపుపై విశ్వాసంతో ఉన్నారు.
ఏది ఏమైనా ఝార్ఖండ్‌లో ఎన్ డి ఏ కూటమి దే అధికార పీఠమని మాజీ ముఖ్యమంత్రి చంపయ్ సోరేన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. గండేలో హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ గెలుపు బాటలో ఉన్నారు. ధన్వార్ బాబూలాల్ మరాండీ. బీజేపీ అధ్యక్షుడు సరాయ్ కెలా లో మాజీ సీయం చంపాయి సోరెన్ ఆధిక్యంలో ఉన్నారు.
అధికార పక్షం.. జేఎంఎం 43, కాంగ్రెస్ 30, ఆర్జేడీ 6, సీపీఐ(ఎంఎల్) నాలుగు చోట్ల పోటీ చేయగా, ప్రతిపక్ష ఎన్డీఏ కూటమి.. బీజేపీ 68, ఏజేఎస్‌యూ 10, జేడీయూ రెండు, లోక్‌జన్‌శక్తి(రామ్ విలాస్) పార్టీ ఒక చోట పోటీ చేశాయి.
ఇప్పటి వరకు అందుతున్న ఫలితాల ప్రకారం ఇండియా కూటమి 49, ఎన్ డి ఏ కూటమి 30, ఇతరులు 2 నియోజకవర్గాల్లో అధిక్యంలో ఉన్నారు.