22.7 C
Hyderabad
Friday, November 27, 2026

Live Video

spot_img

చికెన్‌ మటన్‌ కొనే ముందు ఇలా చేయండి!

వీకెండ్‌ వచ్చిందంటే నాన్‌ వెజ్‌ తప్పనిసరి అయి కూర్చుంది. ఆదివారం చాలా మందికి ముక్కలేనిదే ముద్ద దిగదు అనే పరిస్థితి వచ్చేసింది. మాంసాహారులకు ఇష్టమైన చికెన్, మటన్, చేపల్లో ఏదో ఒకటి ఆ రోజు ఇంట్లో ఉడకాల్సిందే. సండే రోజు మటన్‌ షాపుల ముందు చూసినా, చికెన్‌ షాపుల దగ్గర చూసినా.. వీకెండ్‌ ఫిష్‌ బజార్‌లలో చూసినా జనం క్యూలు కట్టడం సర్వ సాధారణమైపోయింది. గంటలకు గంటలు క్యూలో నిల్చొని మరీ నాన్‌వెజ్‌ సాధించుకొని ఇంటికి వెళ్తుంటారు. అయితే, రెండు నెలలుగా బర్డ్ ఫ్లూ భయం పట్టుకోవడంతో చాలా మంది చికెన్‌కు బదులు మటన్‌, ఫిష్‌ వైపు మొగ్గు చూపారు. అయితే, ఈ అవకాశాన్ని సొమ్ము చేసుకునేందుకు కొందరు వ్యాపారులు కనీస ప్రమాణాలు పాటించకుండానే మాంసం విక్రయింపులు చేస్తున్నారు. మాంసాహారులకు ఇష్టమైన చికెన్, మటన్‌లను కల్తీ చేస్తూ కొంతమంది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ నేపథ్యంలో మటన్‌ షాపుకు వెళ్లినా, చికెన్‌ షాపుకు వెళ్లినా వాళ్లు ఇస్తున్న దానిపై ఓ దృష్టిపెట్టండి. ఆ జీవాలు సురక్షితమైనవేనా? ముందే కోసి పెట్టిన మటన్‌ తాజాయేనా? అన్న అంశాలు తప్పనిసరిగా కనిపెట్టుకోండి.

ఇలా.. కల్తీ చేస్తున్న షాపులపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. వార్నింగ్‌లు ఇస్తున్నారు. షాపులను సీజ్‌ చేస్తున్నారు. అయినా కొందరు వ్యాపారులు మారడం లేదు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో చాలా చోట్ల లైసెన్స్‌ లేకుండానే మాంసం దుకాణాలు నిర్వహిస్తున్నారు. అలాంటి వాటిని జీహెచ్ఎంసీ ఉన్నతాధికారుల బృందం తనిఖీలు చేసింది. కొన్ని చోట్ల భారీ ఎత్తున మాంసాన్ని గుర్తించి సీజ్ చేసింది. ఎక్కడో కోసి నగరానికి తీసుకొచ్చి దుకాణాల్లో విక్రయిస్తున్నారు. అసలు అవి బతికి ఉన్నాయా? లేక చనిపోయిన వాటిని తెచ్చి అమ్ముతున్నారా? అన్న విషయం కూడా తెలియదు.

ఈ క్రమంలోనే హైదరాబాద్ మంగళహాట్ చిస్తీ చమాన్‌లో ఓ మేక మాంసం దుకాణంపై సౌత్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్, జీహెచ్ఎంసీ సర్కిల్ 14 ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా దాడులు చేశారు. ఆ షాపు నిర్వాహకుడు మహమ్మద్ అఫ్రోజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద పాయ, తలకాయ, బ్రెయిన్, కిడ్నీ, మేక గొర్రె లివర్, బీఫ్‌ అంతా కలిపి సుమారు 12 టన్నుల మాంసం స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.8లక్షల వరకు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. అఫ్రోజ్ చెడిపోయిన మేక, గొర్రెల మాంసాన్ని చిస్తీ చమాన్‌లోని తన దుకాణంలో ఫ్రిజ్‌లో నిల్వ చేసి.. తక్కువ ధరకే హోటళ్లు, శుభకార్యాలకు సప్లై చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

గతేడాది చివర్లో బేగంపేట ప్రకాశ్ నగర్‌లోనూ భారీగా చికెన్ వ్యర్థాలు బయటపడ్డాయి. దాదాపు 7 క్వింటాళ్ల కుళ్లిపోయిన చికెన్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఆ చికెన్‌ను నగరంలో కల్లు దుకాణాలు, బార్ షాపులు, వైన్స్ షాపులు, ఫాస్ట్ పుడ్ సెంటర్లు, చిన్న చిన్న హోటళ్లకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.

ఇలాంటి ఆధారాలు దొరుకుతున్న నేపథ్యంలో బయట నాన్‌వెజ్ తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పరిశుభ్రమైన వాతావరణంలో ఉన్న మాంసాహారాన్నే తీసుకోవాలని చెబుతున్నారు. ఎక్కడ పడితే ఒక్కడ మటన్ కొనుగోలు చేయవద్దని, బాగా తెలిసిన వాళ్లు, నమ్మకస్తులైన మటన్ వ్యాపారుల దగ్గరే మటన్‌, చికెన్‌ కొనాలని సలహా ఇస్తున్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com