కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లి ఉన్నత పాటశాలలో మధ్యాహ్న భోజనం తిన్న 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం భోజనం చేసిన తర్వాత ముగ్గురు కడుపునొప్పితో వాంతులు చేసుకున్నారు. విద్యార్థులను వెంటనే కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
విషయం ఆలస్యంగా తెలుసుకున్న తల్లిదండ్రులు ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నట్టు మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మండిపడ్డారు.