ప్రముఖ నటుడు, రెబల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారాయన. ఈ సందర్భంగా ఆర్.నారాయణమూర్తిని సీఎం శాలువాతో సన్మానించారు.
సినీ నటుడు ఆర్. నారాయణ మూర్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు నారాయణ మూర్తి. ఇటీవల ఆయన సినిమాలు తగ్గించారు. ఒకప్పుడు ఆయన ఎన్నో విప్లవాత్మక సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించారు. రీసెంట్ గా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల నారాయణ మూర్తిని కలిశారు. ఆయన తెరకెక్కించనున్న ప్యారడైజ్ సినిమాలో కీలక పాత్రలో నారాయణ మూర్తి నటిస్తున్నారని టాక్ వినిపిస్తుంది.
వచ్చే నెలలో గద్దర్ పేరు మీద తెలంగాణ సినీ అవార్డులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గద్దర్ అవార్డుల విధి విధానాలు, నియమ నిబంధనలు, లోగో రూపొందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో ఆర్.నారాయణమూర్తి సలహాదారుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.