గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయిన రన్యారావు.. ఇప్పుడు దర్యాప్తు అధికారులకు చుక్కలు చూపిస్తున్నట్టు తెలుస్తోంది. రోజుకో స్టేట్‌మెంట్ ఇస్తూ అటు అధికారులను, ఇటు కోర్టును కన్‌ఫ్యూజ్ చేస్తుంది. ఇన్వెస్టిగేషన్ అధికారులు తనను కొట్టారని ఒకసారి.. కాదు తిట్టారని మరోసారి.. తెల్లపేపర్లపై సంతకాలు చేసుకున్నారని ఇంకోసారి.. ఇలా అనేక రకాల స్టేట్‌మెంట్లు ఇస్తూ అధికారులను ముప్పు తిప్పలు పెడుతోంది. అయితే ఇదంతా కావాలనే చేస్తున్నట్టు కోర్టు దృష్టికి తీసుకొస్తున్నారు అధికారులు.
ఇవన్నీ పక్కన పెడితే రన్యారావు కేసులో మరో ఇంట్రెస్టింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. పెళ్లైన ఒక్క నెలకే తాము విడిపోయామంటున్నారు రన్యారావు భర్త జతిన్ హక్కేరి. అయితే అధికారికంగా విడాకులు తీసుకోకపోయినా.. ప్రస్తుతం వేరు వేరుగా జీవిస్తున్నామంటూ కోర్టుకు తెలిపారు జతిన్. నిజానికి తనను అరెస్ట్ చేయవద్దంటూ కోర్టును ఆశ్రయించిన జతిన్‌కు ఈ నెల 24 వరకు రిలీఫ్ లభించింది.
ప్రస్తుతం జతిన్‌పై కూడా DRI అధికారులు ఫోకస్ చేశారు. అతను ఇంటిరియర్ డిజైనర్‌గా మాత్రమే గాకుండా.. ఓ రెస్టారెంట్‌కు ఓనర్‌గా కూడా ఉన్నాడు. రన్యారావుతో అతనికి ఏమైనా వ్యాపార సంబంధాలు ఉన్నాయా? లేదా? అనే దానిపై కూడా ఫోకస్ చేశారు DRI.