29.7 C
Hyderabad
Sunday, April 26, 2026

Live Video

spot_img

ఐపిఎల్ సమరం..65 రోజులు..74 మ్యాచ్‌లు

ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసింది. ఇక ఐపీఎల్ సమరానికి సర్వం సిద్ధమైంది. 65 రోజులపాటు 13 వేదికల్లో 74 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇప్పుడు దేశాల వారీగా ఫైట్ చేసుకున్న క్రికెట్ ఫ్యాన్స్.. ఇప్పుడు ఫ్రాంచైజీల వారీగా ఢీ అంటే ఢీ అనడానికి సిద్ధమయ్యారు.మార్చి 22న ప్రారంభం కానుంది ఐపీఎల్ సీజన్ 18. డిఫెండింగ్ ఛాంపియన్‌ కోల్‌కతా నైట్ రైడర్స్‌, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌తో ఐపీఎల్‌ ఫైట్‌కు అంకురార్పణ పడినట్టే. ఆ తరువాతి రోజు హైదరాబాద్‌, రాజస్థాన్‌ను ఢీకొట్టనుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. అదే రోజు చెన్నై వేదికగా సీఎస్‌కే, ముంబై ఇండియన్స్‌ తలపడనున్నాయ్‌. బౌలర్లను ముప్పు తిప్పలు పెట్టి రికార్డులు తిరగరాయాలని బ్యాటర్లు.. పరుగుల వరద కాదు వీకెట్ల వీరులవ్వాలని బౌలర్లు ఇప్పటికే నెట్స్‌లో చెమటోడుస్తున్నారు.

DC
రిషబ్ పంత్‌ను రిలీవ్ చేసి అందరికి ఓ షాక్ ఇచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఇప్పుడు అక్షర్‌ పటేల్‌ను కెప్టెన్‌ను చేసి మరో సెన్సేషన్ క్రియేట్ చేసింది. 2019 నుంచి DCని అంటిపెట్టుకున్న అక్షర్‌పటేల్‌కు ఈ హోదా దక్కడంలో అసలు తప్పే లేదు. అయితే రాహుల్ తాను కెప్టెన్సీ పగ్గాలు పట్టుకోనని సమాచారం ఇవ్వడంతో DC మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ ఇద్దరు ప్లేయర్స్ చేసిన సేవలు అన్నీ ఇన్నీ కావు. ఇక కుల్దీప్ యాదవ్‌, నటరాజన్, కరుణ్‌ నాయర్, మోహిత్ శర్మ, ఫాఫ్ డెప్లెసిస్ లాంటి దిగ్గజాలు ఇప్పుడు ఢిల్లీ అమ్ముల పొదిలో అస్త్రాలు.

PBK
పంజాబ్ కింగ్స్ 2008 నుంచి ఆడుతున్నా ఇప్పటి వరకు టైటిల్‌ను ముద్దాడలేదు. ఫస్ట్ సీజన్‌లో సెమీస్‌ వరకు చేరిన ఈ టీమ్.. 2014లో ఫైనల్స్‌లో ఓడింది. ఈ రెండుసార్లు తప్ప కనీసం లీగ్‌ను కూడా దాటలేదు ఇప్పటి వరకు. అయితే ఈసారి మాత్రం టీమ్‌లో భారీ మార్పులు చేసింది పంజాబ్. శ్రేయస్ అయ్యర్‌ను రూ.26.75 కోట్లకు కొనుగోలు చేసి జట్టు పగ్గాలను అప్పగించింది. స్టొయినిస్, మ్యాక్స్‌వెల్, ఇంగ్లిస్, జాన్సెన్, ఒమర్జా్, హార్డీ లాంటి కీలక ప్లేయర్స్ ఉన్నారు టీమ్‌లో. ఇక అర్షదీప్ సింగ్, చాహల్‌ కూడా టీమ్‌కు బలమే అని చెప్పాలి.

SRH
ఈసారి టీమ్స్ చాలా వరకు బలంగానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్‌ లాస్ట్ సీజన్‌ను పర్ఫామెన్స్‌ను ఎవ్వరూ మర్చిపోలేరనే చెప్పాలి. ఐపీఎల్ హిస్టరీలోనే మూడు సార్లు హయ్యెస్ట్ స్కోర్ చేసింది SRH. దూకుడుగా ఆడి ఫైనల్స్ వరకు చేరుకుంది. కానీ టైటిల్ పోరులో కోల్‌కతా నైటర్ రైడర్స్ చేతిలో ఓడి.. రన్నరప్‌గా నిలిచింది. భయంకరమైన ఫామ్‌లో ఉన్న ప్లేయర్లు ఇప్పుడు SRH సొంతం. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్, కమ్మిన్స్, నితిష్ కుమార్.. ఇక షమీ, హర్షల్ పటేల్, ఇషాన్ కిషన్, ఉనద్కత్, ఆడప్ జంపా..ఇలా బౌలింగ్, బ్యాటింగ్‌ లైనప్‌లో చాలా బలంగా కనిపిస్తోంది SRH.

KKR
డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ ఈసారి ఫుల్ ఫామ్‌లో ఉన్నట్టే కనిపిస్తోంది. లాస్ట్ సీజన్‌లో టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్.. టీమ్‌ను వీడాడు. ఇప్పుడు టీమ్ పగ్గాలు అజింక్య రహానేకు అప్పగించింది టీమ్ మేనేజ్‌మెంట్. రూ.23.75 కోట్లతో కొనుగోలు చేసిన వెంకటేశ్ అయ్యర్‌ వైస్‌ కెప్టెన్‌గా ఉండనున్నాడు. ఎక్స్‌పీరియన్స్‌డ్ బౌలర్‌గా మారిన వరుణ్‌ చక్రవర్తి, హర్షిత్ రాణా KKR బలమనే చెప్పాలి.

MI
ముంబై ఇండియన్స్ అంటేనే చాలా మందికి ఒక మోజు ఉంటుందని చెప్పాలి. ముంబై ఇండియన్స్ కూడా చాలా బలంగానే కనిపిస్తోంది. సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, తిలక్ వర్మ, బెవోస్ జాకబ్స్ లాంటి బ్యాటర్లు.. పాండ్యా, దీపక్ చాహర్, నమన్, విల్ జాక్స్, స్నాంటర్ లాంటి ఆల్ రౌండర్లు MI సొంతం. ఇప్పటికే ఐదు టైటిళ్లను ఎగరేసుకుపోయిన ఈ టీమ్.. ఈసారి కూడా టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుంది. అయితే ఈసారి బుమ్రా రీ ఎంట్రీ ఇచ్చే టైమ్ ఆ ఫ్రాంచైజీ ఫ్యాన్స్‌కు కాస్త షాక్‌ఇచ్చే అంశం. బీసీసీఐ మెడికల్ టీమ్‌ బుమ్రాకు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో ముంబై టీమ్‌తో ఇంకా బుమ్రా జాయిన్ కాలేదు. ముంబై తమ ఫస్ట్ మ్యాచ్‌ ఈ నెల 23న ఆడనుంది. ఈ మ్యాచ్ బుమ్రా ఆడటం లేదు.

CSK
ఐదుసార్లు ఛాంపియన్… ధోనిలాంటి ఎక్స్‌పీరియన్స్‌డ్ ప్లేయర్ CSK సొంతం. ఏకంగా పదిసార్లు ఫైనల్‌కు చేరింది ఈ టీమ్. ఐదు సార్లు టైటిళ్లు తన ఖాతాలో వేసుకుంది. లాస్ట్ సీజన్ మాత్రం ఆ టీమ్‌కు కాస్త చేదు అనుభవమే అని చెప్పాలి. ధోని, రుత్ రాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, రవీంద్ర జడేజా లాంటి దిగ్గజాలు CSK సొంతం. అశ్విన్, జడేజా, నూర్ అహ్మద్ లాంటి పటిష్టమైన స్పిన్ దళం.. దూబె, సామ్ కరణ్‌, విజయ్ శంకర్, మతీశా పతిరణ, ఖలీల్ అహ్మద్‌లాంటి నిఖార్సైన ప్లేయర్లు ఉన్నారు. ప్రస్తుతం టీమ్ లైనప్‌ చూస్తే దుర్బేధ్యంగా కనిపిస్తోంది.

RCB
ఇక 17 సీజన్‌లుగా ఈ సాల కప్పు నమ్దే అంటూ స్లోగన్స్ ఇస్తూ వస్తున్న ఆర్సీబీ ఈసారైన కప్పు కొడుతుందా? లేదా? అనేది చూడాలి. రజత్ పటీదార్ సారథ్యంలో ఈసారి ఐపీఎల్ ఫైట్‌కు రెడీ అవుతోంది రాయల్ ఛాలెంజర్స్. అయితే విరాట్ కోహ్లీ భుజాలపైనే భారం మోపినట్టు కనిపిస్తోంది. ఫాస్ట్ బౌలర్ హేజిల్ వుడ్.. ఇంగ్లండ్ యంగ్ ప్లేయర్ జాకబ్ బెతేల్.. గాయాల నుంచి కోలుకొని టీమ్‌తో కలవడం వారికి గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. కోహ్లీని పక్కన పెడితే.. బ్యాటింగ్ లైనప్‌ గట్టిగానే కనిపిస్తోంది. ఫిల్ సాల్ట్, రజత్ పాటిదర్, లివింగ్ స్టోన్, కృనాల్ పాండ్యా తమ బ్యాట్‌కు పని చెప్పాల్సిందే. ఇక భువనేశ్వర్ కుమార్ ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తాడో చూడాలి.

RR
2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పుడు తొలి ట్రోఫి తన ఖాతాలో వేసుకుంది రాజస్థాన్ రాయల్స్. సంజూ శాంసన్, యువ సంచలనం యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, హెట్మెయర్, సందీప్ శర్మ, ఆర్చర్, హసరంగలతో టీమ్ బలంగా కనిపిస్తోంది. 2022లో ఈ టీమ్‌ ఫైనల్స్‌కు చేరుకొని ఓడింది. 2024లో ప్లే ఆఫ్స్‌కు కూడా చేరుకుంది. కానీ ఇప్పటి వరకు కప్పును గెలుచుకోలేకపోయింది.

GT
అశిష్‌ నెహ్రా డైరెక్షన్‌లో యంగ్ సెన్సెషనల్ గిల్ సారథ్యంలో ఈసారి కూడా బరిలోకి దిగుతుంది గుజరాత్ టైటాన్స్. గిల్‌తో పాటు గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్, సాయి కిశోర్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, ఇషాంత్ శర్మ, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్ టైటాన్స్ స్క్వాడ్‌లో కీ రోల్ ప్లే చేయనున్నారు. ఇక ఈ టీమ్‌లో నిషాంత్‌ సింధు అనే యువ సంచలనం ఉన్నాడు. అతడు ఈసారి వండర్స్ చేస్తాడన్న ప్రచారమైతే ఉంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com