33.2 C
Hyderabad
Wednesday, June 3, 2026

Live Video

spot_img

చైనాలో భారతీయులు హోలీ జరుపుకున్నారా? భాస్కర నిజ నిర్ధారణ

చైనాలో హోలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారంటూ ఓ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను గమనిస్తే.. పెద్ద ఎత్తున బాణసంచా కాలుస్తున్న దృశ్యాలున్నాయి. భూమిపై నుంచి ఆకాశమంత ఎత్తులో గాలిలోకి రంగులు వెదజల్లుతున్న టపాసుల దృశ్యాలు ఆ వీడియోల్లో కనిపిస్తున్నాయి. చాంతాడంత పొడవున్న టపాసులను వీధుల్లో ఆ చివర నుంచి ఈ చివర దాకా పేర్చి వరుసబెట్టి పేలుస్తున్నారు. ఆ దృశ్యాలను వీధుల్లో ఉన్న జనం తమ బాల్కనీల నుంచి చూస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు.

జరుగుతున్న ప్రచారం :

చైనాలో ఉన్న భారతీయులు ఉత్సాహంగా హోలీ వేడుకలను జరుపుకుంటున్నారంటూ ఈ వీడియోను షేర్‌ చేస్తున్నారు. చైనా వీధుల్లో జరిగిందే అయినా.. అక్కడి భారతీయులు ఈ పండుగ సందర్భంగా టపాసులు పేల్చారన్నది సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్న వాళ్ల ఉద్దేశ్యం. అంతేకాదు.. మరికొందరైతే.. ఇది ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన వేడుకల వీడియో అని, ఇంకొంత మంది.. పంజాబ్‌లో జరిగిన హోలీ వేడుకల దృశ్యాలని సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు.

HINDUSTAN MERI JAAN @Hindustan_Meri1 అనే ఎక్స్‌ యూజర్‌ దీనిని నిన్న సాయంత్రం అంటే. మార్చి 13వ తేదీన షేర్‌ చేశాడు. అందులో చైనాలోని భారతీయులు హోలీ వేడుకలు జరుపుకుంటున్నారని పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన స్క్రీన్‌ షాట్‌, లింక్‌ కింద చూడొచ్చు.

https://x.com/Hindustan_Meri1/status/1900140197624635858?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1900140197624635858%7Ctwgr%5E7fcbfcc809a0fe19c1799e453c34880b0243cdc1%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.telugupost.com%2Ffactcheck%2Fviral-video-does-not-show-holi-celebrations-in-india-1571149

అలాగే, FREE FIRE అనే ఒక యూట్యూబర్‌ కూడా హ్యాపీ హోలీ అనే బగ్‌తో ఈ వీడియోను యూట్యూబ్‌లో నిన్న షేర్‌ చేశాడు. ఆ లింక్‌, ఆ యూట్యూబ్‌ ప్లాట్‌ఫామ్‌ స్క్రీన్‌ షాట్‌ కింద చూడొచ్చు.

Sandeep Tiwari అనే ఇంకో యూట్యూబర్‌ కూడా హ్యీపీ హోలీ అనే హ్యాష్‌ ట్యాగ్స్‌తో ఇదే వీడియోను మార్చి 13వ తేదీన షేర్‌ చేశాడు. ఆ లింక్‌, స్క్రీన్‌ షాట్‌ కూడా కింద గమనించవచ్చు.

భాస్కర న్యూస్‌ నిజ నిర్ధారణ :

సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన వాళ్లలో కొందరేమో చైనాలో జరిగిందంటున్నారు. మరికొందరేమో భారత్‌లోనే జరిగిందంటున్నారు. కానీ, వేర్వేరు రాష్ట్రాల్లో జరిగినట్లు పేర్కొంటున్నారు. మరి.. అసలు ఈ వేడుకలు ఎక్కడ జరిగాయన్న విషయాన్ని తేల్చేందుకు భాస్కర న్యూస్‌ నిజ నిర్ధారణ బృందం డిసైడ్‌ అయ్యింది. డిఫరెంట్‌ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై షేర్‌ అవుతోన్న ఈ వీడియోల నుంచి స్క్రీన్‌ షాట్స్‌ను సేకరించడం జరిగింది. ఆ కీ ఫ్రేమ్స్‌ను ఉపయోగించి రివర్స్‌ ఇమేజ్‌ సెర్చ్‌లో శోధించడం జరిగింది. ఈ శోధనలో మరికొన్ని లింకులు కనిపించాయి. అయితే, అవి హోలీ వేడుకలు కాకుండా.. వేరే వేడుకలకు సంబంధించిన దృశ్యాలుగా పేర్కొన్నారు. పైగా గత నెలలో వీటిని పోస్ట్‌ చేశారు. దీనిని బట్టి చూస్తే నెల రోజుల ముందే చైనాలో భారతీయులు హోలీ జరుపుకునే అవకాశం ఉందా? అంతేకాదు.. ఈ బాణసంచా చైనా కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా కాల్చారంటూ ఆ ప్లాట్‌ఫామ్‌లలో పేర్కొన్నారు.

ముందుగా itschina.baby అనే ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ ఈ వీడియోను షేర్‌ చేసిన లింక్‌ మాకు కనిపించింది. ఫిబ్రవరి 16వ తేదీన ఈ వీడియోను షేర్‌ చేసినట్లు గుర్తించాము. The sixteenth day of the first lunar month అనే రైటప్‌ను ఈ వీడియోకు తగిలించింది. దానికి సంబంధించిన లింక్‌, స్క్రీన్‌ షాట్‌ కింద చూడొచ్చు.

https://www.instagram.com/p/DGIyIhcyTR1/

అలాగే, Velicia Rumi అనే యూట్యూబర్‌ కూడా తన హ్యాండిల్‌పై ఈ వీడియోను షేర్‌ చేశాడు. ఇందులో కూడా The sixteenth day of the first lunar month ❤❤❤ #amazing #lunar అనే రైటప్‌ ఇచ్చాడు. కింద లింక్‌, స్క్రీన్‌ షాట్ గమనించవచ్చు.

మరో ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ livingchina కూడా Oh, the incredible Chaozhou Spring Festival అనే రైటప్‌తో ఈ వీడియోను ఫిబ్రవరి 16వ తేదీన పోస్ట్‌ చేశాడు. ఈ బాణసంచా కాల్చడం అనేది చావోజౌ స్ప్రింగ్ ఫెస్టివల్ వేడుకల్లో భాగమని పేర్కొన్నాడు. చావోజౌ అనేది చైనాలోని తూర్పు గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని ఒక నగరం.

https://www.instagram.com/livingchina/reel/DGHljClJDpT/

ఈ యేడాది ఫిబ్రవరి 16వ తేదీన ఓ యూట్యూబ్‌ ప్లాట్‌ఫామ్‌పై BJ PARK పోస్ట్‌ చేసిన వీడియోలో మరో కోణంలో ఇదే బాణసంచా కాల్చిన వీడియో దృశ్యాలు ఉన్నాయి. వాటిని కూడా గమనించవచ్చు.

ఇక, ఈ వేడుకల గురించి నిర్ధారణ చేసుకునేందుకు చైనా న్యూ ఇయర్‌ వేడుకలకు సంబంధించిన న్యూస్‌ క్లిప్పింగ్స్‌, వార్తా నివేదికలను పరిశీలించడం జరిగింది. వాటిని గమనిస్తే.. స్ప్రింగ్ ఫెస్టివల్ అని కూడా పిలువబడే చైనీస్ న్యూ ఇయర్ 15 రోజుల పాటు జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం రంగు రంగుల కవాతులు, సాంస్కృతిక కార్యక్రమాలు వంటి సంప్రదాయ రీతిలో ఈ ఉత్సవాలను జరుపుకుంటారు. ఈ యేడాది.. జనవరి 29న ప్రారంభమైన వేడుకలు.. ఫిబ్రవరి 12వ తేదీన లాంతర్ ఫెస్టివల్‌తో ముగిశాయి. ఈ మధ్య కాలంలో చైనాలోని ఇతర ప్రదేశాలతో పాటు గ్వాంగ్‌డాంగ్, జియాంగ్జీ ప్రావిన్స్‌లో ఇలా పెద్ద ఎత్తున బాణసంచా పేల్చారు. ప్రతి యేడాదీ ఇలాగే ఉత్సవాలు జరుగుతాయని తెలిసింది. ఈ ఉత్సవాలకు సంబంధించిన వార్తా నివేదికలను కింద గమనించవచ్చు.

https://www.hindustantimes.com/lifestyle/festivals/chinese-new-year-2025-dates-animal-of-the-year-significance-celebration-and-all-about-spring-festival-101737878386134.html

https://www.ecns.cn/video/2025-01-30/detail-ihenhtcy1321802.shtml

=============================================================

వైరల్‌ అవుతున్నదేంటి ?

చైనాలో భారతీయులు హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.

వాస్తవం ఏంటి ?

చైనా న్యూ ఇయర్‌ వేడుకలకు సంబంధించిన దృశ్యాలు అవి.

భాస్కర న్యూస్‌ ఫ్యాక్ట్‌చెక్‌ :

సోషల్‌ మీడియాలో జరుగుతున్నది తప్పుడు ప్రచారం. భాస్కర న్యూస్‌ ఫ్యాక్ట్‌చెక్‌ టీమ్‌ పరిశీలనలో ఈ వాస్తవం వెల్లడయ్యింది.

=============================================================

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com