బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ ఒక్కరోజులోనే మూడుసార్లు నిలిచిపోయింది. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఎక్స్ సేవలకు అంతరాయం కలిగింది. దీనిపై ఇప్పుడు ఎలాన్ మస్క్ స్పందించారు. ఆయన నేరుగా ఉక్రెయిన్‌పైనే అనుమానం వ్యక్తం చేశారు. మాములుగా ఇలాంటి ప్లాట్‌ఫామ్‌లపై సైబర్ దాడులు జరుగుతూనే ఉంటాయి.. కానీ ఏకంగా ఉక్రెయిన్ పేరు రావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఎక్స్‌పై జరిగిన సైబర్ అటాక్ వెనక చాలా పెద్ద గ్రూప్ లేదా ఓ దేశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు ఎలాన్ మస్క్. సైబర్ అటాక్ చేసింది ఎవరు? ఎక్కడి నుంచి చేశారు? అనే విషయాలను తేల్చే పనిలో ఉన్నామని.. ప్రస్తుతం ఆ ఐపీ అడ్రస్లన్ని ఉక్రెయిన్ ప్రాంతాన్నే సూచిస్తున్నాయన్నారు మస్క్.
అయితే పాలస్తీనాకు అనుకూలంగా పనిచేసే డార్క్ స్ట్రోమ్ అనే గ్రూప్ ఈ సైబర్ అటాక్ చేసింది తామే అని ప్రకటించుకుంది. కానీ ఇందులో ఎంత వరకు నిజముందో అనేది తేల్చే పనిలో ఉన్నారు అధికారులు. అయితే ఎగ్జాక్ట్‌గా ఏం జరిగిందో తెలియదు అంటున్నారు మస్క్.
ఈ డార్క్ స్ట్రోమ్ ఇప్పుడే కాదు గతంలో కూడా పలు సైబర్ అటాక్స్ చేసింది. ఇజ్రాయెల్‌కు ఆర్థిక, సైనిక సాయం చేసే దేశాలను టార్గెట్‌గా చేసుకొని దాడులకు పాల్పడుతోంది. కానీ మస్క్ చెప్పిన మాటల్లో మాత్రం చాలా పెద్ద నెట్ వర్క్ లేనిదే ఇలాంటి సైబర్ అటాక్స్ చేయడం కష్టం అంటున్నారు. ఎక్స్‌పై రోజూ సైబర్ దాడులు జరుగుతాయని.. కానీ ఇంత భారీ స్థాయిలో జరగాలంటే చాలా వనరులు అవసరం అంటున్నారు మస్క్.