35.9 C
Hyderabad
Thursday, June 4, 2026

Live Video

spot_img

పాకిస్థాన్ స్టార్ మహీరా ఖాన్

పాకిస్థాన్ స్టార్ హీరోయిన్ మహీరాఖాన్ ఫ్యాషన్స్ లో ఎప్పుడు ముందు ఉంటుంది. పాకిస్థాన్లో సినీ నటుల మీద ఎన్నో ఆంక్షలు ఉన్నా మహీరా లెక్కచేయకుండా సినిమా షూటింగుల్లో పాల్గొంటోంది. 2011లో సినీ రంగంలోకి అడుగుపెట్టిన మహీరా…ప్రస్తుతం పాకిస్థాన్ లో అత్యధిక పారితోషికం తీసుకునే స్టార్ హీరోయిన్ గా అగ్రస్థానంలో ఉంది. సోషల్ మీడియాలో తన లేటెస్ట్ పిక్స్ షేర్ చేసి..కనుల విందు చేస్తోంది.

పఠాన్ వర్గానికి చెందిన మహీరా 1984లో కరాచీలో జన్మించింది. మహీరా తండ్రి ఇండియాకు చెందిన వారే కాగా దేశ విభజన సమయంలో వారి కుటుంబం కరాచీ షిఫ్ట్ అయ్యింది.

పాఠశాల విద్య కరాచీలో పూర్తి చేసిన మహీరా ఉన్నత విద్య కోసం లాస్ ఏంజిల్స్ వెళ్లింది. అమెరికా నుంచి వచ్చి కొన్ని ఉత్పత్తులకు మోడల్ గా చేసి పేరుతెచ్చుకుంది.

2006లో MTV Pakistan చానెల్ విజెగా కెరీర్ ప్రారంభించిన మహీరా..ఆ తర్వాత Aag TV తో వీకెండ్ విత్ మహీరా కార్యక్రమం చేసి మంచి పాపులారిటీ తెచ్చుకుంది.

అమెరికాలో పరిచయమైన వ్యాపారవేత్త అలీ అస్కరీని 2007లో వివాహం చేసుకున్న మహీరాకు 2010లో ఓ కుమారుడు జన్మించాడు. అయితే ఈ జంట 2016లో విడిపోయి విడాకులు తీసుకున్నారు.

2023లో పాకిస్థాన్ వ్యాపారవేత్త  సలీం కరీంతో పరిచయం ప్రేమగా మారింది. చాలా రోజులు డేటింగ్ లో ఉన్న ఈ జంట సన్నిహితుల సమక్షంలో 2023లో వివాహం చేసుకున్నారు.

బాలీవుడ్ లో రేయిస్(Raees)సినిమా చేసిన మహీరా…భారత్ అంటే తనకు మక్కువ అని తడుముకోకుండా చెపుతుంది.

రెండు దేశాల ఫ్యాషన్ అనుకరించే మహీరా ఏ మాత్రం వీలు చిక్కినా చీరకట్టులో ఫంక్షన్లకు వెళ్లేందుకు ఇష్టపడుతుంది.

భారత్, పాకిస్థాన్ రెండు దేశాల సంస్కృతులు, సంప్రదాయాలు ఒకటేనని ఇరు దేశాల ప్రజల ఆహార అలవాట్లు ఒకటేనని బహిరంగంగానే స్టేట్మెంట్ ఇస్తుంది.

అందాల మహీరా స్టార్ గా ఎంత బిజీగా ఉన్నా ప్రతి ఏడాది చారిటీ కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంది.

courtesy: instagram

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com