33.9 C
Hyderabad
Wednesday, June 3, 2026

Live Video

spot_img

ఉక్రెయిన్‌కు సైనిక సాయం బంద్..

అమెరికా అధ్యక్ష కార్యాలయంలో జెలెన్ స్కీ, డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన డైలాగ్ వార్ ఎఫెక్ట్ కనిపించడం ప్రారంభమైంది. ఉక్రెయిన్‌కు అందాల్సిన సైనిక సాయాన్ని నిలిపివేయాలని ట్రంప్ అధికారులను ఆదేశించారు. దీంతో ఇప్పుడు ఉక్రెయిన్‌కు షాక్ తగిలినట్టైంది. అయితే ఈ చర్యలను అమెరికా సమర్థించుకుంది. రష్యాతో శాంతి ఒప్పందం చేసుకోవాలని ఉక్రెయిన్‌పై ఒత్తిడి తీసుకొచ్చేందుకే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు వైట్‌హౌజ్ ప్రకటించింది. తమ లక్ష్యం శాంతిని స్థాపించడమే అని.. అందుకే ఈ ఒప్పందం చేసుకోవాలని అమెరికా కోరుతుందని తెలిపింది. అంతేకాదు ఇది తాత్కాలిక నిర్ణయమే అని కొసమెరుపు ఇచ్చింది.

ఉక్రెయిన్‌ విషయంలో అమెరికా రెండు లాభాలను చూస్తుంది. ఒకటి రష్యాతో యుద్దాన్ని ఆపాలి. అప్పుడే బిలియన్ల కొద్ది డాలర్లు కుమ్మరించడం ఆగుతుంది. రెండోది ఇప్పటి వరకు చేసిన సాయానికి ప్రతిఫలంగా అక్కడ ఖనిజాలను తవ్వుకోవాలి. దీని వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా తయారవుతుంది.. అమెరికన్ కంపెనీలు లాభపడతాయి. అందుకే ఈ యుద్ధాన్ని ఆపాలన్న కృతనిశ్చయంతో ఉన్నారు ట్రంప్.

జెలెన్ స్కీ మాత్రం ముందు వాగ్వాదానికి దిగి.. ఆ తర్వాత ఈ డీల్‌కు ఓకే అని లండన్‌లో ప్రకటించారు. అయితే ఇప్పుడప్పుడే వీరిద్దరి మధ్య జరిగిన వాగ్వాదం తాలుకూ మరకలు పోయేలా కనిపించడం లేదు. ఈ ఘటనతో ట్రంప్‌పై రష్యా అనుకూల ముద్ర పడింది. ఈ విషయంలో జెలెన్ స్కీ సక్సెస్ అయ్యారు. ట్రంప్‌ను బూచిగా చూపుతూ మొత్తం యూరప్‌ను ఏకం చేయడంలో సక్సెస్ అయ్యారు. అయితే ఓ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్నట్టు కనిపిస్తోంది. అదేంటంటే ఏ యూరప్ దేశం కూడా ఇప్పుడు ఉక్రెయిన్‌కు ఆర్థిక, సైనిక సాయం చేసే పరిస్థితిలో లేకపోవడం. అందుకే ట్రంప్‌పై ప్రేమతో కాకపోయినా.. అవసరం కోసమైనా తగ్గి ఈ డీల్‌కు ఒప్పుకుంటున్నట్టు కనిపిస్తోంది.

కానీ ట్రంప్ మాత్రం తన విధానంలోనే ముందుకు వెళుతున్నారు. సాయం కోరి వచ్చిన వాళ్లు.. తగ్గి ఉండాలనే తీరుగా ఆయన వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు దాని ఎఫెక్టే ఉక్రెయిన్‌కు సైనిక సాయం ఆగిపోవడం. అయితే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు జెలెన్ స్కీ ఓ ప్రకటన చేశారు. అదేంటంటే ఇరు దేశాల మధ్య యుద్ధం ఆగేందుకు చేసుకునే ఒప్పందం చాలా చాలా దూరంలో ఉందన్నారు. ఈ స్టేట్‌మెంట్‌ను చూస్తే ఇప్పట్లో ఒప్పందం జరగదని ఆయన చెప్పకనే చెప్పినట్టు కనిపిస్తోంది. అందుకే వెంటనే సైనిక సాయం నిలిపివేయడంపై ట్రంప్ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది.

కానీ ఇక్కడో గమ్మతైన విషయం ఏంటంటే ట్రంప్‌ కోణంలో ఆలోచిస్తే ఆయన చేసేది సరైనదే. ఎందుకంటే ఉక్రెయిన్ యుద్ధం చేసేందుకు అమెరికా ఎందుకు డబ్బును ఖర్చు చేయాలి? దాని వల్ల అమెరికాకు వచ్చే లాభమేంటి? అని. కానీ అమెరికా కోణంలో ఆలోచిస్తే మాత్రం ఇది ముమ్మాటికి తప్పే. ఎందుకంటే ఉక్రెయిన్ కదనరంగంలో దిగడానికి కారణమే అమెరికా. ఎప్పుడైతే బైడెన్, జెలెన్ స్కీ నాటోలో చేరేందుకు పావులు కదిపారో.. అప్పుడే రష్యా దాడులకు తెగబడింది. ఆలస్యం చేస్తే తమ దేశం మొత్తానికే ప్రమాదమని భావించింది. అదే ఇంతటి మారణహోమానికి కారణమైంది. ఉక్రెయిన్‌ ఇప్పుడీ పరిస్థితిలో ఉండటానికి కారణమే అమెరికా. ఇక జెలెన్ స్కీ అస్సలు నమ్మకూడని అమెరికాను నమ్మి.. ఇప్పుడు ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com