27 C
Hyderabad
Wednesday, June 3, 2026

Live Video

spot_img

తెలంగాణ సొమ్ము రాహుల్‌గాంధీ అకౌంట్‌లోకి – కెటిఆర్‌

బ్యాగులు మోసి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డిని పక్కన పెట్టుకొని బ్యాగులు మోయొద్దని కాంగ్రెస్ కొత్త ఇన్చార్జి మీనాక్షి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అప్పట్లో చంద్రబాబుకు బ్యాగులు మోస్తే ,ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానానికి రేవంత్ రెడ్డి బ్యాగులు మోస్తున్నాడని ఆరోపించారు. మంచి మైక్ లో చెప్పాలి చెడు చెవిలో చెప్పాలంటున్న రేవంత్ ఒక్క మంచి పని చేయలేదు కాబట్టే ఎవరూ మైక్ లో చెప్పడం లేదన్నారు. హైడ్రా విధ్వంసం, ఆర్ఆర్ టాక్స్, భూకబ్జాలు, అంతులేని అవినీతితో కుప్పకూలిన ఎస్ఎల్బీసీ టన్నెల్, మొన్ననే కొట్టుకపోయిన పెద్దవాగు, మునిగిన వట్టెం పంప్ హౌస్ ఇలా చెప్పడం మొదలుపెడితే రేవంత్ చెవుల నుంచి రక్తం కారుతుందన్నారు కేటీఆర్.

చేవెళ్ల నియోజకవర్గం శంకర్ పల్లి మండల మాజీ MPP గోవర్ధన్ రెడ్డితో పాటు సుమారు 500 మంది బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన కేటీఆర్, తెలంగాణలో రేవంత్ రెడ్డిని తిట్టని వ్యక్తి లేరన్నారు. జనవరి 26న ఖాతాల్లో డబ్బులు పడతాయని హామీ ఇచ్చి, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పారు. రుణమాఫీ జరగలేదు, పెన్షన్లు పెరగలేదు, రైతు భరోసా లేదు, ఆడబిడ్డలకు తులం బంగారం లేదు, కళ్యాణ లక్ష్మి నిలిపివేశారు” అని ఆరోపించారు.

కేసీఆర్ హయాంలో ప్రశాంతంగా ఉన్న తెలంగాణ, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో విధ్వంసం, అరాచకాలతో కుప్పకూలిందన్నారు కేటీఆర్. “హైడ్రా, మూసి కూల్చివేతలతో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని దెబ్బతీశారు. మేడ్చల్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య చేయడం దురదృష్టకరం” అన్నారు కేటీఆర్. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై మాట్లాడుతూ, “కేసీఆర్ హయాంలో 90% పనులు పూర్తయ్యాయి. కేవలం 10% పనులు చేస్తే చేవెళ్లకు నీళ్లు వస్తాయి. కానీ రేవంత్ రెడ్డి అలా చేయడం లేదు. కేసీఆర్‌కు పేరు వస్తుందన్న అసూయతో ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. మూసి సుందరీకరణ కోసం రూ.1,50,000 కోట్లు ఖర్చు చేసి కమిషన్లు దండుకొని, కాంగ్రెస్ అధిష్ఠానానికి పంపి తన పదవి కాపాడుకోవాలని చూస్తున్నారు” అని విమర్శించారు.

రేవంత్ రెడ్డి హయాంలో నీళ్లు పాతాళంలోకి, నిధులు ఢిల్లీకి వెళ్తున్నాయి. రైతులకు రుణమాఫీ లేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. ఒక్క సంవత్సరంలో రూ.1,50,000 కోట్ల అప్పు చేసి, ఒక్క కొత్త పథకం కూడా ప్రారంభించలేదు. 450 మంది రైతులు, ఆటో డ్రైవర్లు, చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టారు” అని కేటీఆర్ ఆరోపించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com