తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత సంచలన ట్వీట్ చేశారు. బీజేపీ సహా ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో జైలు నుంచి విడుదలయ్యాక తొలిసారి రాజకీయ ఆరోపణలు చేశారు. ఎన్ని సార్లు ఎన్ని ఆరోపణలు వచ్చినా ప్రధాని అదానీ వైపేనా ?? అని ఎక్స్‌లో కవిత ప్రశ్నించారు. అఖండ భారతంలో అదానికో న్యాయం.. ఆడబిడ్డకో న్యాయమా అని ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్ట్ చేయడం ఈజీ అని.. అదే ఆధారాలు ఉన్నా అదానీను అరెస్ట్ చేయడం మాత్రం కష్టమా? అని కవిత ఎక్స్‌లో ప్రధానిని ప్రశ్నించారు.