38.2 C
Hyderabad
Saturday, April 18, 2026

Live Video

spot_img

గడీల పాలనను బద్దలు కొట్టి ప్రజల మధ్య పాలన సాగిస్తున్నాం : డిప్యూటీ సీఎం

తమది ప్రజా ప్రభుత్వమని, ప్రజలతో మమేకం అవుతూ పాలన సాగిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి గాంధీభవన్లో ప్రజలు, కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. గురువారం డిప్యూటీ సీఎం గాంధీభవన్లో ప్రజలు, కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమం సందర్భంగా మీడియా తో మాట్లాడారు. కాంగ్రెస్ భావజాలాన్ని నమ్మి ఓట్లు వేసిన ప్రజల ఆలోచనలు, పార్టీ కార్యకర్తల ద్వారా వారి అభిప్రాయాలను తెలుసుకొని పరిష్కరించేందుకు ప్రజా ప్రభుత్వం లో మంత్రులు, డిప్యూటీ సీఎం గా నేను గాంధీభవన్ కార్యక్రమానికి హాజరవుతున్నట్టు తెలిపారు. గత ప్రభుత్వం గడీల మధ్యన పాలించగా నేడు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి యావత్ క్యాబినెట్ ప్రజల మధ్య పాలన చేస్తుందని తెలిపారు.

రాష్ట్రంలో విద్య, వైద్యంపై ప్రజా ప్రభుత్వం దృష్టి నిలిపిందని తెలిపారు. ప్రపంచ స్థాయి విద్యను పేద విద్యార్థులకు అందించేందుకు సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. నేటి బాలలే రేపటి భవిష్యత్తు అని యావత్ క్యాబినెట్ ఆలోచన చేసి హాస్టల్ విద్యార్థుల చార్జీలను 40% పెంచాలని వివరించారు. గత పాలకులు 10ఏ ళ్లపాటు ఈ అంశాన్ని పక్కన పడేశారు అన్నారు. 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తు సరఫరా, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఐదు లక్షలతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఇవన్నీ ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వం విజయాలు అన్నారు. అధికారంలోకి రాగానే ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తామని చెప్పాము ఏడాదిలోపే 50 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, గత పది సంవత్సరాల పాటు గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించలేకపోయారని, మేము అధికారంలోకి రాగానే పేపర్ లీకేజీలు, ఎలాంటి అడ్డంకులు లేకుండా విజయవంతంగా గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించామని అన్నారు.

జనాభాలో సగభాగం ఉన్న మహిళలను దృష్టిలో పెట్టుకొని ఏడాదికి 25 నుంచి 25 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు.. ఐదు సంవత్సరాల కాలంలో మహిళలకు లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఒప్పించి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుంది అన్నారు. పరిశ్రమలు, ఉత్పత్తి అంటే అదాని, అంబానీ మాత్రమే అనుకునేవారు కానీ తాము వారిని కిందికి దించి స్వయం సహాయక సంఘాల సభ్యులతో 10 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని వివరించారు. ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేసి వాటిని మహిళా సంఘాలకు అప్పగించి.. వారు ఆర్టీసీకి బస్సులు లీజుకు ఇచ్చి ఆదాయం పొందేలా చూస్తామని అన్నారు.


ప్రపంచస్థాయి స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని, మూలనపడ్డ 65 ఐటిఐ లను అడ్వాన్స్ సెంటర్లుగా తీర్చిదిద్దుతున్నాం అన్నారు. కుల గణన చారిత్రాత్మక నిర్ణయమన్న భట్టి.. దీనిని అడ్డుకోవాలని దోపిడీదారులు సర్వేపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. సర్వే పూర్తయితే ఇన్నాళ్లు దోచుకున్న వారి ఆటలు సాగవని అన్నారు. ఫ్యూడల్ వ్యవస్థ నుంచి బయటికి తెచ్చి సమ సమాజ నిర్మాణానికి ప్రజా ప్రభుత్వం పునాదులు వేస్తుంది అన్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com